TS Election Results 2023: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ కనబరిచింది. నెల రోజులుగా ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 35655 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే ముందుగా భద్రాచలం, అశ్వరావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో ఏదో ఒక ఫలితం ముందుగా వెల్లడి కానుంది. చార్మినార్ లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉన్నందున.. తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే అవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాష్ట్రంలో ఆరు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఫలితాలు వెల్లడి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500 నుంచి 600 వరకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సాధారణ నియోజకవర్గాల్లో 14 లెక్కింపు టేబుల్స్ ఏర్పాటు చేయగా.. ఈ ఆరు నియోజకవర్గాల్లో మాత్రం 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం విశేషం.