అమెరికా వదిలిపెట్టి వెళ్లిపోతానంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..?

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తక్కువ సమయంలో ఉండటంతో ప్రచారంలో వేగం పెరిగింది. ట్రంప్ జో బిడెన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ట్రంప్ జో బిడెన్ గెలిస్తే అమెరికా వదీ వెళ్లిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నుంచి కోలుకున్న ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. రిపబ్లికన్‌ పార్టీయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందని ట్రంప్ జోస్యం చెప్పారు. గతంలో […]

Written By: Navya, Updated On : October 18, 2020 8:13 pm
Follow us on

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తక్కువ సమయంలో ఉండటంతో ప్రచారంలో వేగం పెరిగింది. ట్రంప్ జో బిడెన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ట్రంప్ జో బిడెన్ గెలిస్తే అమెరికా వదీ వెళ్లిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నుంచి కోలుకున్న ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.

రిపబ్లికన్‌ పార్టీయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందని ట్రంప్ జోస్యం చెప్పారు. గతంలో ప్రజలు రిపబ్లిక్ పార్టీని గెలిపించి తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారని.. మరోమారు తనను గెలిపించాలని ట్రంప్ కోరారు. మెజారిటీ సర్వేలు జో బిడెన్ కే అనుకూలంగా ఫలితాలు వెలువడవచ్చని చెబుతున్నాయి. దీంతో ట్రంప్ ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో పూర్తి ధీమాతో ఉన్నట్టు ఓటర్లు నమ్మే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

నా ఓటమిని మీరు ఊహించగలరా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు బిడెన్ గెలిస్తే అమెరికా వదిలి వెళ్లిపోతానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. జార్జియాలోని మాకన్‌లో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మిచిగాన్ లో ట్రంప్ మాట్లాడుతూ ఎన్నికల గురించి తాను మాట్లాడాల్సిన అవసరమే లేదని అన్నారు. మరో నాలుగు సంవత్సరాలు తమ పార్టీదే అధికారం అని చెప్పారు.

ప్రజలంతా తమ పార్టీ విజయం కొరకు ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. ప్రజల అండదండలతో అమెరికాలో ఇప్పటివరకు పాలన సాగిందని.. రాబోయే ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పారు. నవంబర్‌ 3న అమరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడో బిడెన్ గెలుస్తాడో చూడాల్సి ఉంది.