Trump And Putin And Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. అసలు ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడాని ప్రయత్నిస్తున్నారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుదన్న కారణంతో భారత దిగుమతులపై 25 శాతం అదపు టారిఫ్ విధించారు. ఇక భారతీయులను అమెరికాకు రాకుండా చేసేందుకు వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కంపెనీలను ఆదేశించారు. వీసా ఫీజును భారీగా పెంచారు. దీంతో భారత్ చైనాకు దగ్గరవుతోంది. ఇప్పుడు పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. దీంతో ట్రంప్‌కు ఏం జరుగుతుందో అంతు పట్టడం లేదు.
రష్యాతో రక్షణ ఒప్పందాలు
పుతిన్ డిసెంబర్ 4న భారత్‌కు వచ్చారు. ఎస్–400 వంటి రక్షణ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ట్రంప్ రష్యా చమురు ఆపమని చెప్పినా, భారత్ ఆయుధ కొనుగోళ్లతో సంబంధాలు బలోపేతం చేస్తోంది. ఇది అమెరికాకు అసహనం కలిగించవచ్చు.
ముగ్గురు.. ముగ్గురే..
ట్రంప్ ‘మోదీ నా ఆప్తమిత్రుడు‘ అని చెప్పి ఆయుధ డీల్స్ చేస్తూ, రష్యా విషయంలో ఒత్తిడి చూపుతారు. పుతిన్‌తో శాంతి చర్చలు, ఉక్రెయిన్ యుద్ధం మధ్య మోదీ భారత్ దౌత్య స్వతంత్రత్వాన్ని కాపాడుతున్నారు. ముగ్గురి మధ్య సంబంధాలు క్రాస్‌వర్డ్‌లా మలుపులు తిప్పుకుంటున్నాయి.
ట్రంప్ పుతిన్ పర్యటనపై స్పందించి హెచ్–1బీ వీసాలు, సుంకాలపై మళ్లీ ఒత్తిడి చేసే అవకాశం ఉంది. భారత్ రష్యా–అమెరికా మధ్య సమతుల్యత కాపాడుతూ రక్షణ, వాణిజ్య లాభాలు పొందుతుంది. ఈ దౌత్య ఫజిల్‌లో మోదీ కీలక పాత్ర పోషిస్తారు.