https://oktelugu.com/

TRS vs BJP: ఆత్మగౌరవ నినాదం: కేంద్రం టార్గెట్.. మళ్లీ సెంటిమెంట్ రగిలిస్తున్న టీఆర్ఎస్

TRS vs BJP: టీఆర్ఎస్ పక్కా వ్యూహంతోనే వెళుతోంది. ఈసారి ధాన్యం కొనుగోళ్లు, రైతుల సెంటిమెంట్ ను వాడుకోవాలని స్కెచ్ గీసినట్టుగా అర్థమవుతోంది. తాజాగా టీఆర్ఎస్ రాష్ట్రమంత్రి హరీష్ రావు ఎంట్రీ ఇచ్చి ఆత్మగౌరవ నినాదాన్ని బయటకు తీశారు. ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్ ఆంధ్రనేతల నుంచి వాడుకున్న ఈ నినాదాన్ని ఇప్పుడు బీజేపీపై ప్రయోగిస్తోంది. నాడు సెంటిమెంట్ బాగా ఉంది. ఇప్పుడు రాష్ట్రం రాకతో ఆ పరిస్థితులు లేవు. అయితే ఈ ప్లాన్ వర్కవుట్ అయితే బీజేపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2021 / 01:40 PM IST
    Follow us on

    TRS vs BJP: టీఆర్ఎస్ పక్కా వ్యూహంతోనే వెళుతోంది. ఈసారి ధాన్యం కొనుగోళ్లు, రైతుల సెంటిమెంట్ ను వాడుకోవాలని స్కెచ్ గీసినట్టుగా అర్థమవుతోంది. తాజాగా టీఆర్ఎస్ రాష్ట్రమంత్రి హరీష్ రావు ఎంట్రీ ఇచ్చి ఆత్మగౌరవ నినాదాన్ని బయటకు తీశారు. ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్ ఆంధ్రనేతల నుంచి వాడుకున్న ఈ నినాదాన్ని ఇప్పుడు బీజేపీపై ప్రయోగిస్తోంది. నాడు సెంటిమెంట్ బాగా ఉంది. ఇప్పుడు రాష్ట్రం రాకతో ఆ పరిస్థితులు లేవు. అయితే ఈ ప్లాన్ వర్కవుట్ అయితే బీజేపీ అడ్డంగా బుక్కవ్వడం ఖాయం.

    TRS vs BJP

    తాజాగా ఢిల్లీ వెళ్లి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులను కలుస్తున్న టీఆర్ఎస్ మంత్రులు దూకుడు మంత్రం జపిపిస్తున్నారు. రైతుల సమస్యలపై కేంద్రమంత్రులు కలిసేదాకా ఢిల్లీ వదిలిపెట్టేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు.

    తెలంగాణ మంత్రులను ఉద్దేశించి‘మీకేం పని లేదా?’ అంటూ కేంద్రమంత్రి పీయూష్ చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ఆయుధంగా మలిచారు. రాజకీయ నేతలా మాట్లాడారని హరీష్ నిప్పు రాజేశారు. ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరచడమేనని.. 70 లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. పీయూష్ గోయల్ చేసిన విమర్శలను తక్షణమే ఉపసంహరించుకొని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

    అంతటితో ఆగకుండా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించారు. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అని.. మా పుట్టుక తెలంగాణ జాతి ప్రయోజనాల కోసం అని.. మాకు మా రాష్ట్రం.. 70 లక్షల మంది రైతుల ప్రయోజనాల కంటే ఏదీ ముఖ్యం కాదని.. ప్రజల్లో బీజేపీని విలన్ ను చేసే ప్రయత్నాలను టీఆర్ఎస్ పకడ్బందీగా చేస్తోంది.

    Also Read: తాడో పేడో తేలేనా.. టీఆర్ఎస్ వ్యూహం ఫలించేనా?

    తెలంగాణ బీజేపీ నేతలను కలిసి.. తెలంగాణ మంత్రులను పీయూష్ గోయల్ కలవకపోవడమే ఇప్పుడు టీఆర్ఎస్ అస్త్రంగా మలిచింది. బీజేపీకి రైతుల ఓట్లు కావాలి కానీ.. వడ్లు అక్కరలేదా? అంటూ టీఆర్ఎస్ రాజకీయం షురూ చేసింది.

    తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసిన కేసీఆర్ కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలతో రాష్ట్రమంతా నీరు పారించారు. రైతులు పంటలు పండించడానికి రూ.14500 కోట్లు సహాయం చేస్తున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఇన్ని చేస్తే పండిన పంటను అమ్ముకునేందుకు మార్గం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశం. దాన్ని రాష్ట్రాలకు ఇస్తే తెలంగాణ సర్కార్ ఏదో ఒక దేశంతో మాట్లాడుకొని అమ్ముకునేది. దీంతో కేంద్రం అలా ఇవ్వకుండా.. ఇటు కొనకుండా మొండికేస్తోంది. ఈ క్రమంలోనే దీన్ని రాజకీయ అవకాశంగా టీఆర్ఎస్ మలుచుకుంటోంది. తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీకి ఈ ‘ధాన్యం కొనుగోళ్ల’తోనే కొట్టాలని టీఆర్ఎస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

    Also Read: కేసీఆర్ ప్లాన్ కు కౌంట‌ర్ వేస్తున్న కమలనాథులు..

    Tags