TRS Supports Opposition Candidate: రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తీసుకున్న నిర్ణయంపై గిరిజనులు, మహిళల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు దేశ అత్యున్నత పదవి గిరిజన సమాజిక వర్గానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్పించింది. గిరిజన అభ్యర్థికి తటస్థ పార్టీలతోపాటు విపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. కానీ గిరిజన జనాభా 20 శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ మాత్రం గిరిజన మహిళకు కాకుండా విపక్షాల అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడం తెలంగాణ గిరిజనులతోపాటు 50 శాతం మహిళలను ఆశ్చర్యానికి గురిచేసింది.
విపక్ష కూటమిలో లేమంటూనే…
తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేంద్రానికి రాష్ట్రపతి ఎన్నికల్లో పెద్ద షాక్ ఇవ్వాలనుకున్నారు. ఈమేరక రెండు నెలల్లో సంచలనం జరుగుతందని స్వయంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో అందరూ రాష్ట్రపతి ఎన్నికల్లో అనూహ్య నిర్ణయం ఉంటుందని విపక్షాలతోపాటు, రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి 20 రోజులు దాటినా కేసీఆర్ ఉలుకు పలుకు లేకుండా ఫాం హౌస్‌కే పరిమితమయ్యారు. ఇటీవల తృణమోల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపక్ష పార్టీల సమావేశానికి కూడా టీఆర్‌ఎస్ హాజరు కాలేదు. పది రోజుల క్రితం ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌కు కూడా డుమ్మా కొట్టింది. కానీ అనూహ్యంగా, విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు ప్రత్యక్షమయ్యారు. దీంతో సంచలనం ఉంటుందన్న కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సంచలనం చేయలేక కేసీఆర్ చతికిలపడ్డారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అయితే విపక్ష కూటమిలో లేమంటూనే విపక్షాలతో కలిసి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించడం కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లే అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Also Read: Alia Bhatt Pregnant: పెళ్లి అయిన 3 నెలలకే తల్లి కాబోతున్న ‘అలియా’ !
పాడిందే పాడరా అన్న చందంగా..
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ తర్వాత ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మళ్లీ ‘పాడిందే పాడరా’ అన్నట్లు కేంద్రంపై పాత విమర్శనాస్త్రాలో మరోమారు వల్లించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్, ప్రాజెక్టులకు జాతీయ హోదా, కేంద్రానికి అధికంగా పన్నులు చెల్లించాం అంటూ పాత పాటే పాడారు. కానీ తెలంగాణ ప్రజలు ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం కాకపోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కేంద్రం ప్రకటించింది. సకాలంలో భూములు చూపకుండా కేంద్రంపై కావాలనే విమర్శలు చేస్తోందని ప్రకటించింది. ఇక బయ్యారం ఉక్కుపై కేంద్రం నియమించిన కమిటీ అక్కడ లభించే ఐరన్ ఓర్ నాసిరకమైనదని, ఫ్యాక్టరీ ఏర్పాటుతో నష్టం తప్ప లాభం ఉండదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చింది. అయినా కేటీఆర్ మళ్లీ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై నెంప నెట్టే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. పదేపదే చెబితే అబద్ధం కూడా నిజం అవుతుందన్నట్లుగా కేటీఆర్ తీరు కనిపిస్తోంది. ఇక సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కేంద్ర జలవనరుల శాఖకు ప్రాజెక్టేలకు సంబంధించిన డీపీఆర్ ఇవ్వకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శలు చేస్తోంది. ఏడాది క్రితం బండి సంజయ్ బయటపెట్టిన నివేదికతో ఇది బహిర్గతమైంది. మరోవైపు కృష్ణాజలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఏపీకి ఇచ్చి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబులో కూడా కేసీఆర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈవిషయాన్ని రాష్ట్రం దాచిపెట్టింది. బండిసంజయ్ దీనిని ప్రజలముందు ఆధారాలతో ఉంచారు. దీనిపై నోరు మెదపని టీఆర్‌ఎస్ నేతలు మళ్లీ జాతీయ హోదా ఇవ్వడం లేదంటూ ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు.
Also Read: Pawan Kalyan: ఈటల రాజేందర్ లానే పవన్ కళ్యాణ్ ను గెలిపించేస్తారు!?