TRS Politics : మొక్క గా ఉన్న పార్టీని మానుగా చేసింది ఈ ఉద్యమకారులే కదా.. కడుపు మండి ఓ మాట తిడితే తిట్టి ఉండోచ్చు.. మళ్లి ప్రతిదాడులెందుకు? తెలంగాణా కోసం, పార్టీ కోసం కష్టపడ్డవారికి ఆ మాత్రం బాధ, ఆవేధన ఉండదా..? నిన్న మొన్న వచ్చినోడికి… పార్టీకి రూపాయి పనిచేయనోడికి రాష్ట్ర స్థాయి పదవులు రాబట్టే.. పార్టీ అవిర్బావం నుంచి కాష్టపడ్డ వారికి, ఉద్యకారుల జీవితాలు ఇప్పటికి గట్లనే ఉండే.. ఆయా నియోకజవర్గాల్లో కనీస మర్యాద, గౌరవం కూడా ఉద్యమకారులకు లేకపాయే. ఎమ్మెల్యే లు కూడా వీరిని గంజిల ఈగలెక్క తీసివేయపట్టిరి.. వాళ్ల గ్రూపులు వారివేనాయే.. కులము, డబ్బును చూసి నేడు తెలంగాణాలో పదవులు, పరపతి వస్తుంటే తెలంగాణ ఉద్యమకారులకు కాలదా..కడుపు మండదా..?

ఈ రోజు రహీంఉన్నీసా కన్నీరు కార్చీ.. ఆ ఎమ్మెల్యేను సర్వనాశనం కావాలని శపించింది కావచ్చు..తప్పే.. కానీ ఆమె గుండెల వెనక ఉన్న బాధను అర్థం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు. తిరిగి ఆవిడపై .. ఇతర మహిళలతో బూతు పురాణం షురు చేయవడితిరి. హిందు కానీ,ముస్లీం కానీ, మైనార్టీ కానీ.. ఒక ఆడబిడ్డ ఏడుపు ఎవరికి మంచిది కాదు.. ఆవిడను పిలుచుకోని ఓదార్చి.. పార్టీ పరంగానో.. ఇంకో విధంగానే రహీం ఉన్నీసాకు టీఆర్ఎస్ న్యాయం చేయాలి.. రహీం ఉన్నీసానే కాదు.. తెలంగాణ ఉద్యమంలో పని చేసి టీఆర్ఎస్ పార్టీ అవిర్బావం నుంచి ఉన్నవారు ఇప్పుడు టీఆర్ఎస్ లో తక్కువే.. ప్రతి నియోజకవర్గంలో పార్టీకి మొదటి నుంచి పనిచేసిన వారు 50 మంది దాటరు.. వారి జీవితాలనో.. లేదా రాజకీయ ప్రముఖ్యత కల్పించడమో..నామీనేట్ పోస్టులు కేటాయించడమో.. టీఆర్ఎస్ కు అంత కష్టమేం కాదు.. పదవులు ఇవ్వడం కష్టమైతే.. కడు పెదరికంలో ఉన్న వారిని కనీసం ఆర్థికంగా ఆదుకునే పరిస్థితియైన పార్టీ తరుపున చేయాలి..
ఇటువంటి ఉద్యమకారులపై బీ(టి)ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫక్కా దృష్టి సారించాలి.. బువ్వ తిన్న తినకున్న.. అటుకులు బుక్కి.. ఆకలి తీర్చుకొని తెలంగాణా కోసం ఉద్యమం చేసిన తెలంగాణా బిడ్డలను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలి.. ప్రస్తుతమున్న షోకాల్డ్ లీడర్లు.. పదవులు కోసం.. వచ్చినవాళ్లు ఎప్పటికైన ఎప్పుడైన పార్టీకి..దోరుకుతరు..రేపు టీఆర్ఎస్ అధికారం కోల్పేతో.. ఇదేలీడర్లు అప్పటి రూలింగ్ పార్టీలోను చేరడానికి..పదవుల కోసం ముందుంటారు… కానీ ఇలాంటి నికార్సయిన కార్యకర్తలు, ఉద్యకారులు వెయ్యి జన్మలెత్తిన టీఆర్ఎస్ పార్టీకి దొరకరు..
రహీం ఉన్నీసా ఎక్కడ వరంగల్ నుంచి సిరిసిల్లకు వచ్చి ఆనాడు విజయమ్మ సభలో చావు దెబ్బలు తిని, ఆస్పత్రిలో చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడింది. విజయమ్మ సభను అట్టర్ ప్లాప్ చేసింది.. పోలీసు జీపు పైనుంచి కింద పడి తీవ్ర గాయాలైన దృశ్యం ఇప్పటికి నా కళ్ల ముందు కదలాడుతుంది.. ఇది విమర్శ కాదు… తెలంగాణా వ్యాప్తంగా చాలా మంది ఉద్యమకారుల పరిస్థితి ఇదే.. మంచి మనసుతో ఆలోచించాలి.
-కయేతి బాలు