https://oktelugu.com/

TRS MLA Car Accident: టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు బీభత్సం.. ఒకరిని చంపి.. ముగ్గురిని గాయపరిచినా చర్యల్లేవా?

TRS MLA Car Accident:  అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారు హైదరాబాద్ లో బీభత్సం సృష్టించింది. వీధి వ్యాపారుల కుటుంబానికి చెందిన ఓ పసికందు ప్రాణాన్ని తీసి ముగ్గురిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఇంత జరిగినా పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇది వీవీఐపీ కార్ల రిజిస్ట్రేషన్ లోపాలు, టీఆర్ నెంబర్ ప్లేట్లతో జరుగుతున్న దారుణాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ కారుపై […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2022 / 05:03 PM IST
    Follow us on

    TRS MLA Car Accident:  అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారు హైదరాబాద్ లో బీభత్సం సృష్టించింది. వీధి వ్యాపారుల కుటుంబానికి చెందిన ఓ పసికందు ప్రాణాన్ని తీసి ముగ్గురిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఇంత జరిగినా పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇది వీవీఐపీ కార్ల రిజిస్ట్రేషన్ లోపాలు, టీఆర్ నెంబర్ ప్లేట్లతో జరుగుతున్న దారుణాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.

    నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ కారుపై ఉండడం.. ఈ కారు 2 నెలల బాలుడిని చంపడం.. ముగ్గురిని తీవ్ర గాయాలు పాలు చేసింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నది ఎవరు? డ్రైవింగ్ చేసింది ఎవరు వంటి వివరాలన్నీ గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది. బాధితులు ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ , మరొక వ్యక్తి పారిపోయారని తెలిపారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఖరీదైన జూబ్లీహిల్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆ ఘటన స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు చెప్తుండడం విమర్శలకు తావిస్తోంది. హైటెక్ సిటీ అని చెప్పుకునే పోలీసులే ఈ కేసులో నిందితులను తప్పిస్తున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ కారు నడిపింది ఎమ్మెల్యే కుమారుడు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    ఈ కారు యాక్సిడెంట్ జరిగి 24 గంటలు అయినా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆచూకీని పోలీసులు కనిపెట్టకపోవడం విస్మయపరుస్తోంది. ఎమ్మెల్యే  షకీల్ కుమారుడు డ్రైవింగ్ సీట్లో ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదురు నిందితుడిని తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఉన్నట్టుండి అకస్మాత్తుంగా నిందితుడిని పట్టుకున్నామంటూ మీర్జా అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారని తెలిసింది.

    ప్రమాదానికి కారణమైన కొత్త కారుపై బోధన్ ఎమ్మెల్యే అనే స్టిక్కర్ ఉంది. కానీ బోధన ఎమ్మెల్యే మాత్రం అసలు తనకు ఈ కారుతో సంబంధం లేదని.. స్టిక్కర్ అడిగితే తాను ఇచ్చానని తెలుపడం విశేషం.

    ఇక కారు తరుఫున వచ్చిన కొందరు వైద్యం ఖర్చులకు అని రూ.2 లక్షల రూపాయలు ఇచ్చి బాధితులను వారి సొంతూరు మహారాష్ట్రకు పంపించినట్టు సమాచారం. నిమ్స్ ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన బాధితురాలు కాజల్ చౌహాన్, కుటుంబ సభ్యులు, మృత శిశివును తీసుకొని సొంతూరుకు బయలు దేరింది. దీన్ని బట్టి దీనివెనుక పెద్ద తతంగమే ఉన్నట్టు తెలుస్తోంది.

    తన ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు జరిగినా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల కొడుకునైనా సరే జైలుకు పంపిస్తానని బీషణ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్.. ఇలా ఓ ఎమ్మెల్యే కారు స్టిక్కర్ ఉన్న కారు యాక్సిడెంట్ చేసి వీధి వ్యాపారుల కుటుంబంలోని ఓ పసిబాలుడి ప్రాణాలు తీస్తే ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కారు అవ్వడం వల్లే యాక్షన్ తీసుకోవడం లేదని.. నిందితులను పట్టుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.