KCR Sonia PK: దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు రోజులుగా తెలంగాణ సీఎం నివాసం ప్రగతి భవన్ బస చేసి మరీ కేసీఆర్ తో ఏం మాట్లాడినట్టు? అసలు వీరి మధ్య అంత రహస్య సంభాషణలు ఏమై ఉంటాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై ఆరాతీసిన సన్నిహిత వర్గాలకు ఆసక్తికర విషయాలు తెలిసాయని సమాచారం. ఇంతకీ సోనియాతో వరుసగా భేటి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన పీకే అసలు కేసీఆర్ తో ఏం చెప్పారు? ఆ ప్రతిపాదనలేంటి? అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.దానిపై స్పెషల్ ఫోకస్..
-కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం?
సోనియాగాంధీతో చర్చలు జరిపిన పీకే నేరుగా హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ తో ఆయన నివాసంలో చర్చలు జరిపారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ కు తక్కువ మెజార్టీ వస్తే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలకం అవుతాడు. ఆయన అనుసంధాన కర్తగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి కీలక పదవి కట్టబెడుతారు. అప్పటి అవసరాలను బట్టి కేసీఆర్ కు కేంద్రంలో కీలక పదవి దక్కవచ్చు. సీట్లు భారీగా వస్తే రాహుల్ ను కాదని ప్రధాని పదవిని చేపట్టవచ్చు. ఎన్నికల్లో కేసీఆర్ బలాన్ని బట్టి.. ఆయనకు మద్దతును బట్టి కేంద్రంలో ప్రాధాన్యత దక్కుతుంది. అయితే ఇందుకు కండీషన్ ఏంటంటే.. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేయాలి. అప్పుడే కేసీఆర్ కు కేంద్రంలో అందలం దక్కుతుంది. ఈ మేరకు ప్రగతిభవన్ లో కేసీఆర్ కు పీకే విలీన ప్రతిపాదన చేసినట్టు సమాచారం.
Also Read: Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, పవన్ కడుపున పవనే పుడతాడు !
-కేటీఆర్ కు తెలంగాణ సీఎం పోస్టు
ఇక ఈ విలీన ప్రతిపాదన ఒప్పుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు గెలవడంతో ఆ పార్టీపై వ్యతిరేకత బోలెడంతా ఉంది. సో ఒంటరిగా గెలవడం కష్టమేనంటున్నారు. అందుకే కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి కేటీఆర్ ను సీఎం చేయవచ్చన్నది ప్రశాంత్ కిషోర్ ప్లాన్ గా తెలుస్తోంది.
-సోనియా, కేసీఆర్ మధ్య పీకే రాయబారం
గత కొన్ని రోజులుగా అటు సోనియాను.. ఇటు కేసీఆర్ ను ఈ విలీన ప్రతిపాదనపై పీకే ఒప్పించడానికి ట్రై చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు పీకే ప్రతిపాదనకు అటు సోనియా.. రాహుల్ లు కోర్ టీంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్ ను పైకి లేపడానికి.. బీజేపీని ధీటుగా ఎదుర్కోవడానికి కేసీఆర్ లాంటి బలమైన నేత కాంగ్రెస్ కు అవసరం అందుకే దీనిపై కోర్ టీంతో సోనియా చర్చిస్తున్నట్టు సమాచారం. సోనియా మాటనే కేసీఆర్ కు చెప్పిన పీకే ఈ మేరకు గులాబీ బాస్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
-తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల పరిస్థితేంటి?
అయితే తెలంగాణలో ఉన్న ఏకైక బలమైన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ రెండింటికి మొత్తం 119 నియోజకవర్గాల్లో బలం, నాయకులు, క్యాడర్ ఉంది. ఈ రెండు పార్టీలు కలిస్తే అంత మందిని సర్దుబాటు చేయడం కష్టం. వీరందరూ బీజేపీలో చేరి ఆ పార్టీ బలోపేతమై చివరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పుట్టి మునుగుతుంది. అందుకే ఈ విలీన ప్రతిపాదన ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ విలీనానికి కేసీఆర్ ఒప్పుకుంటే జాతీయనేతగా మారిపోతారు. తెలంగాణ సహా దేశ రాజకీయాలు అనూహ్యంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.