https://oktelugu.com/

TRS vs Congress: కాంగ్రెస్‌లో ఫుల్ జోష్.. ‘కారు’ దిగుతున్న కీలక నేతలు

TRS vs Congress: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న నేతలే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. నేతలతో పడలేక తమ పదవులను తృణప్రాయంగా భావిస్తున్నారు. పార్టీకి సేవ చేయాలని చేరినా సరైన గౌరవం లేకపోవడంతోనే పార్టీకి టాటా చెబుతున్నట్లు చెబుతున్నారు. కీలక పదవుల్లో ఉన్న వారు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం అగ్రనేతల ఆగ్రహంతో దూరం జరుగుతున్నారు. రాజీనామాలు చేయడానికి కూడా వెనకాడడం లేదంటే వారిలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 30, 2021 / 11:04 AM IST
    Follow us on

    TRS vs Congress: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న నేతలే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. నేతలతో పడలేక తమ పదవులను తృణప్రాయంగా భావిస్తున్నారు. పార్టీకి సేవ చేయాలని చేరినా సరైన గౌరవం లేకపోవడంతోనే పార్టీకి టాటా చెబుతున్నట్లు చెబుతున్నారు. కీలక పదవుల్లో ఉన్న వారు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం అగ్రనేతల ఆగ్రహంతో దూరం జరుగుతున్నారు. రాజీనామాలు చేయడానికి కూడా వెనకాడడం లేదంటే వారిలో ఎంతటి వైరాగ్యం పెరిగిందో అర్థమవుతోంది.

    రెండు సార్లు అధికార పీఠం ఎక్కడంతో టీఆర్ఎస్ లో మంచి భవిష్యత్ ఉందనే ఆశతో బీజేపీ, టీడీపీ, వామపక్షాలు తదితర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ (TRS) పార్టీలో చేరారు. మంచి పదవులకు కూడా ఎన్నికయ్యారు. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో తమ పదవులను వదులుకోవాలని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ (Congress), బీఎస్పీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు సైతం టీడీపీలో చేరిపోయారు.

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడార్ల గంగనర్సయ్యకు ఎమ్మెల్యే రేఖానాయక్ కు పొసగకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో జోష్ పెరుగుతోంది. తాజాగా బెజ్జూర్ పీఏసీఎస్ చైర్మన్ అర్షద్ హుస్సేన్ కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పడకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన బీఎస్పీలో చేరినట్లు సమాచారం.

    పంచాయతీలకు కూడా పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో పనులు అర్థంతరంగా నిలిచిపోతున్నాయి. చేసన పనులకు కూడా బిల్లులు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాంకిడిలో 24 మంది సర్పంచులు, కొమురంభీం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. తమ సమ్యలు పరిష్కరించకుంటే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. పార్టీకి మంచి రోజులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది.