KCR BJP Congress: కేసీఆర్ టార్గెట్ ఫిక్స్.. బీజేపీ కూడా అదే దారి.. కాంగ్రెస్ కు ఏంటీ పరిస్థితి?

KCR BJP Congress: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీలో తమకు తామే పోటీగా భావించి రెండు పార్టీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి.. తెలంగాణలో రెండేళ్ల కిందటి వరకూ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయం నడిచింది. కానీ ఎప్పుడైతే హుజూరాబాద్ లో బీజేపీ గెలిచిందో అప్పుడే రాజకీయం ఒక్కసారిగా మారింది. అధికార టీఆర్ఎస్ కు కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా టీఆర్ఎస్, బీజేపీలు […]

Written By: NARESH, Updated On : May 17, 2022 11:27 am
Follow us on

KCR BJP Congress: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీలో తమకు తామే పోటీగా భావించి రెండు పార్టీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి.. తెలంగాణలో రెండేళ్ల కిందటి వరకూ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయం నడిచింది. కానీ ఎప్పుడైతే హుజూరాబాద్ లో బీజేపీ గెలిచిందో అప్పుడే రాజకీయం ఒక్కసారిగా మారింది. అధికార టీఆర్ఎస్ కు కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా టీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఈసారి తెలంగాణలో టార్గెట్ మిస్ కాకూడదని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే పాగా వేయాలని గట్టి పట్టుదలతో ఉంది.

Revanth, KCR, Sanjay

ఈ క్రమంలోనూ కాంగ్రెస్ ను అవైడ్ చేస్తూ టీఆర్ఎస్, బీజేపీ గేమ్ మొదలుపెట్టాయి. ఇటీవల తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడేందుకు.. అధికారం దక్కించుకునేందుకు స్తానిక నేతలకు దిశానిర్ధేశం చేశారు. తెలంగాణలో ఈసారి టీఆర్ఎస్ ను ఓడగొట్టాలని.. బీజేపీ తమకు పోటీనే కాదంటూ స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రకటనలు అటు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలతోపాటు ఇటు బీజేపీ అగ్ర నేతలు లైట్ తీసుకున్నారు. అమిత్ షా, బండి సంజయ్ సహా చాలా మంది అసలు కాంగ్రెస్ ను పట్టించుకున్న పాపాన పోలేదు. రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని విమర్శించే విషయంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

Also Read: Sohail Khan-Seema Khan Divorce: ఆ స్టార్ ఇంట విడాకులు.. కారణం ఆ హీరోయినే !

బీజేపీని పక్కనపెడితే టీఆర్ఎస్ నేతలు అసలు కాంగ్రెస్ ను సీరియస్ గా తీసుకోవడం లేదనే చర్చ సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు కొద్దిరోజుల వ్యవధిలోనే పర్యటించారు. అయితే టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీ నేతలు చేసిన విమర్శలపైనే ఎక్కువగా స్పందిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ఈ రకంగా చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే తెలంగాణలో ఆ పార్టీ కూడా రేసులోకి తీసుకొచ్చినట్టు అవుతుందని టీఆర్ఎస్ కావాలనే అవైడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ ను అంత సీరియస్ గా తీసుకోవద్దని టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ నే కాదు.. ఆ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న బీజేపీ కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. తెలంగాణలో తమ టార్గెట్ టీఆర్ఎస్ మాత్రమేనని ఫిక్స్ అయిన బీజేపీ కాంగ్రెస్ పై అస్సలు విమర్శలు చేయడం లేదు. కేంద్రహోంమంత్రి అమిత్ షా సైతం తెలంగాణలో బహిరంగ సభలో మాట్లాడినా కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనలేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ ను కావాలనే టీఆర్ఎస్, బీజేపీ అవైడ్ చేస్తూ ప్రజల్లో ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: Rashmika Mandanna: పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసిన రష్మిక.. లుక్ అదిరింది

Recommended Videos: