NTR Death Anniversary: ఆయన విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు. కానీ వెన్ను పోటు ద్వారా కన్ను ముశాడు. “అల్లుడు దశమ గ్రహం” అని తెలుసుకునే లోపు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. అంత మంది కొడుకులు,బిడ్డలు ఉన్నప్పటికీ చరమాంకం లో చాలా ఇబ్బంది పడ్డాడు. ఇదంతా తెలిసిన చరిత్ర. అలాంటి యుగ పురుషుడిని తరిమేసిన నాయకులే…ఆయన పెట్టిన పార్టీని పట్టుకుని ఊరేగుతున్నారు. 2019 లో 23 దగ్గర జనం ఆపి వేయడంతో మళ్ళీ పీఠం ఎక్కాలని ఉవ్విళ్ళు రుతున్నారు. ఇందుకు ఎప్పుడో గతించిన ఎన్టీవోడి పాట పాడుతున్నారు.. మరీ గత కొద్ది ఏళ్ళుగా జయంతులు,వర్థంతులు భారీగా చేస్తున్నారు.

నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నగారి విగ్రహాలకు నివాళులు అర్పించారు.. పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.. దీన్ని ఎవరూ తప్పుపట్టరు.. తప్పు పట్టే అవకాశం కూడా లేదు.. కానీ ఇప్పుడు అధికారంలోకి రావాలి కాబట్టి ఎన్టీఆర్ బొమ్మను టిడిపి నాయకులు విపరీతంగా వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే వర్ధంతి లోనూ ఎన్టీఆర్ విగ్రహం ఎదుట “లే లే లే.. నా రాజా” అనే ఐటం సాంగ్ పెట్టుకుని, నేల బారు డ్యాన్స్ లు వేసుకుంటూ నివాళ్లు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల సమీకరణం కాబట్టి… నివాళ్ళు అర్పించడంలో, క్లబ్ డ్యాన్స్ లు చేయించడం లో ఆ కులస్తులు పోటీ పడ్డారు.

మాట మాట్లాడితే ఎన్టి రామారావు కారణజన్ముడు అని అభివర్ణించే తెలుగుదేశం పార్టీ నాయకులు ఐటెం సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ లు వేస్తూ అన్న గారికి నివాళులు అర్పించే విధానాన్ని ఎలా సమర్థించుకుంటారో వారికి తెలియాలి. వాస్తవానికి మహనీయులైన వ్యక్తులకు పూల మాలలు వేసి నివాళ్లు అర్పిస్తాం. ఏవైనా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఇవేవీ గుర్తు ఎరుగని కార్యకర్తలు పైశాచిక అభిమానాన్ని ప్రదర్శించారు.. పది మందిలో అభాసు పాలయ్యారు. జనం దృష్టిలో పార్టీని మరింత పలుచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.