చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎంతటి వారికైనా శిక్ష ఉండాల్సిందే. జరిమానా విధించాల్సిందే. అది మంత్రి అయినా ఎవరైనా ఒకటే. నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝుళిపించాల్సిందే. తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గాంధీ జయంతి వేళ నిబంధనలు పాటించకుండా తప్పుడు దారిలో వచ్చారు. దీంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు కేటీఆర్ కు జరిమానా విధించారు.
కాగా తన వాహనానికి ట్రాఫిక్ పోలీసులు రాసిన చలానాతో ఎస్సై ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును పిలిపించి వారిని సన్మానించారు. మంత్రి అయినా భయపడకుండా విధి నిర్వహణ చేసినందుకు వారిని అభినందించారు. ఇలాగైతే సామాన్యులకు సైతం విశ్వాసం కలుగుతుందని చెప్పారు. నగర పలీస్ కమిషనర్ అంజనీకుమార్ సమక్షంలో ఆ ఇద్దరిని పిలిపించి శాలువాతో సన్మానించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు.
అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులైనా సరే నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. ఏదో కారణంతో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందే. లేకపోతే ఎవరికి కూడా చట్టంపై నమ్మకం ఏర్పడదు. దీంతో ఎవరు కూడా నిబంధనలు పాటించకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. తన వాహనానికి జరిమానా విధించడాన్ని సమర్థించారు.
గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో హడావిడిగా వెళ్లే క్రమంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాల్సి వచ్చిందన్నారు. అందుకే తగిన మూల్యం చెల్లించానని పేర్కొన్నారు. పోలీసుల విధి నిర్వహణ ఓ కత్తి మీద సామే అయినా బాధ్యతల కోసం పాటుపడటం ఆహ్వానించదగినదే. మంత్రి కేటీఆర్ తన వాహనానికి చలానా చెల్లించారు.
