https://oktelugu.com/

PM Modi Revanth reddy: మోడీ చెప్పింది నిజమా? కాదా? టీఆర్ఎస్, కాంగ్రెస్ మైండ్ గేమ్?

PM Modi Revanth reddy: తెలంగాణలో ఇప్పుడు మోడీ వ్యాఖ్యల కలకలం రేగుతోంది. మోడీ ఉమ్మడి ఏపీ విభజనను శాస్త్రీయంగా చేయలేదని మాత్రమే అన్నాడు. తెలంగాణకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు.కానీ ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఆందోళన బాటపట్టాయి. అయితే మోడీని టార్గెట్ చేసి తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ లు మైండ్ గేమ్ లు ఆడుతున్నాయి. మోడీని, బీజేపీని టార్గెట్ చేసి ముందుకెళుతున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ తీరు చూస్తుంటే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 9, 2022 / 09:26 PM IST
    Follow us on

    PM Modi Revanth reddy: తెలంగాణలో ఇప్పుడు మోడీ వ్యాఖ్యల కలకలం రేగుతోంది. మోడీ ఉమ్మడి ఏపీ విభజనను శాస్త్రీయంగా చేయలేదని మాత్రమే అన్నాడు. తెలంగాణకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు.కానీ ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఆందోళన బాటపట్టాయి.

    అయితే మోడీని టార్గెట్ చేసి తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ లు మైండ్ గేమ్ లు ఆడుతున్నాయి. మోడీని, బీజేపీని టార్గెట్ చేసి ముందుకెళుతున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ తీరు చూస్తుంటే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడేందుకు రెడీ అయ్యారు.ఈ క్రమంలోనే ఆయన భవిష్యత్తులో కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకోగలడు. బీజేపీని నిలువరించేందుకు ఏమైనా చేయగలడు..

    తెలంగాణ కోసం గొంగళిపురుగును అయినా ముద్దు పెట్టుకుంటానని కేసీఆర్ అన్నారు.ఇప్పుడు బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ తోనూ కలవగలడు. ఇప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏం కానుందన్నది ప్రశ్న. కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలిస్తే రేవంత్ రెడ్డి ఆ పార్టీలోనే ఉండరు. ఎందుకంటే కేసీఆర్ కు వ్యతిరేకంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.

    ఈ క్రమంలోనే మోడీ పై టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకే పంథాలో ముందుకెళ్లడం భవిష్యత్ రాజకీయాలను సూచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ రాజకీయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.