సీఎం కేసీఆర్ షురూ చేశాడు..!

ఫాంహౌస్ నుంచి.. ప్రగతి భవన్ నుంచి అంత ఈజీగా బయటకు రాడు అని విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు పట్టువీడాడు. జనాల బాటపట్టాడు. జనాల్లో తిరుగడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటనలు మొదలుపెట్టాడు. ముందుగా తన సొంత జిల్లా సిద్దిపేట నుంచే ప్రజల్లోకి వెళ్లడాన్ని కేసీఆర్ షూరూ చేయడం విశేషం. రూ.4 కోట్లతో కట్టిన సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించాడు. సిద్దిపేటలో పలు ఇతర అభివృద్ధి […]

Written By: NARESH, Updated On : June 20, 2021 1:51 pm
Follow us on

ఫాంహౌస్ నుంచి.. ప్రగతి భవన్ నుంచి అంత ఈజీగా బయటకు రాడు అని విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు పట్టువీడాడు. జనాల బాటపట్టాడు. జనాల్లో తిరుగడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటనలు మొదలుపెట్టాడు.

ముందుగా తన సొంత జిల్లా సిద్దిపేట నుంచే ప్రజల్లోకి వెళ్లడాన్ని కేసీఆర్ షూరూ చేయడం విశేషం. రూ.4 కోట్లతో కట్టిన సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించాడు. సిద్దిపేటలో పలు ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించాడు.

ఇక కొండపాక మండలం రాంపల్లి శివారులోని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సముదాయాన్ని సీఎం ప్రారంభించాడు. అనంతరం 25 ఎకరాల్లో ఒకే నమూనాతో నిర్మించిన సిద్దిపేట కలెక్టరేట్ల భవన సముదాయాలను కేసీఆర్ ప్రారంభించారు. మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.

ఇక సిద్దిపేట పర్యటన తర్వాత కేసీఆర్ పక్కనే ఉన్న సిరిసిల్ల, కామారెడ్డిలల్లో సైతం పర్యటించబోతున్నారు. వరుసగా జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నాడు.