Tornado: మనిషిపై ప్రకృతి పగ తీర్చుకుంటుందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. ఓవైపు కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే మరోవైపు వరదలు, తుఫానులు, అతివృష్ణి, అనావృష్టి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటూ మానవ జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. తాజాగా టోర్నోలు మనవాళికి సవాలు విసురుతుండటం చూస్తుంటే ప్రకృతి మనిషిని గట్టి హెచ్చరికలను పంపిస్తున్నట్లే కన్పిస్తోంది.
నిన్నటి వరకు కరోనాతో అల్లాడిపోయిన అమెరికా తాజాగా టర్నోడోలతో వణికిపోతోంది. అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో టర్నోడోలు బీభత్సం సృష్టించడంతో వందకు పైగా అమెరికన్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు? ఇంకేంత మంది ప్రాణాలతో బయటపడ్డారనేది తెలియాల్సి ఉంది.
అమెరికాలో టర్నోడోలు సృష్టించిన బీభత్సంపై ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ‘అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద విపత్తుల్లో ఒకటి’ అని జోబైడెన్ వ్యాఖ్యానించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టర్నోడో ప్రభావిత ప్రాంతాలను ఆదుకుంటామని, తానే స్వయంగా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తానని జోబైడెన్ వెల్లడించారు.
కెంటకీలోనే టర్నోడోల దాటికి 70మంది అమెరికన్లు మృతిచెందినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధికులు మేఫీల్డ్ లోని క్యాండిల్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులే ఉన్నారు. టర్నోలు వీచే సమయంలో ఫ్యాక్టరీలో 110మంది ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది. వీరిలో 40మంది కాపాడగలిగినట్లు వారు చెబుతున్నారు. ఇక సుడిగాలిలతో ఆ ప్రాంతమంతా నేలమట్టమైంది. దీంతో ఈ ప్రాంతమంతా బీభత్సంగా మారిపోయింది.
మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్, టెన్నెసీ తదితర ప్రాంతాల్లో టర్నోడోలు బీభత్సం సృష్టించగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం కలిగింది. బాధితులను కాపాడటంలో రెస్య్కూ టీంతోపాటు అమెరికా రెడ్ క్రాస్ సొసైటీ కీలకంగా వ్యవహరిస్తోంది. కాగా 1925 సంవత్సరంలో మిస్సౌరీలో వీచిన భారీ సుడిగాలులకు 915మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత ప్రస్తుత కెంటకీ నగరంలో అలాంటి టర్నోడోలు విధ్వసం సృష్టించినట్లు అమెరికన్లు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Some of the worst destruction from the Kentucky tornado was centered in Mayfield, a town of nearly 10,000 people. At least 110 people were huddled inside a candle factory in the area when a tornado ripped through. https://t.co/1VRJZXLBWw pic.twitter.com/Mh3i3oEzZa
— The New York Times (@nytimes) December 11, 2021