Telangana slang in Tollywood: భీమ్లానాయక్ టు ఆర్ఆర్ఆర్: సినిమాల్లో హీరోలు తెలంగాణ యాస మాట్లాడితేనే హిట్టా?

Telangana Slang In Tollywood: తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా సంతోషంగా కనిపించారు. అప్పట్లో జోకర్లతో తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష మాట్లాడిస్తూ ఎద్దేవా చేసేవారని..కానీ ఇప్పుడు తెలంగాణ యాస, భాషను హీరోలు మాట్లాడుతూ హిట్ కొడుతున్నారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత గౌరవం వచ్చిందన్నది అసెంబ్లీ సాక్షిగా విడమరిచి చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగుల చిరకాల వాంఛ అయిన ఉద్యోగాల ప్రకటన చేసిన సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు […]

Written By: NARESH, Updated On : March 9, 2022 6:33 pm
Follow us on

Telangana Slang In Tollywood: తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా సంతోషంగా కనిపించారు. అప్పట్లో జోకర్లతో తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష మాట్లాడిస్తూ ఎద్దేవా చేసేవారని..కానీ ఇప్పుడు తెలంగాణ యాస, భాషను హీరోలు మాట్లాడుతూ హిట్ కొడుతున్నారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత గౌరవం వచ్చిందన్నది అసెంబ్లీ సాక్షిగా విడమరిచి చెప్పారు.

Telangana slang in Tollywood

తెలంగాణలో నిరుద్యోగుల చిరకాల వాంఛ అయిన ఉద్యోగాల ప్రకటన చేసిన సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలో హీరోలు తెలంగాణ భాష మాట్లాడితేనే ఆ సినిమా హిట్ అవుతోందని.. సినిమాల్లో తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, పోచమ్మ తల్లికి పూజలు వంటి అన్ని అంశాలు వైభవంగా వెలుగొందుతున్నాయని కేసీఆర్ సినిమాలపై సునిశిత పరిశీలనను బయటపెట్టారు.

నిజానికి తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగానే టాలీవుడ్ పనిచేస్తోంది. ఎంతో మంది హీరోలు, సినీ కళాకారులకు తెలుగు చిత్ర పరిశ్రమ ఉపాధినిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ కు పెద్ద పీట వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రా, రాయలసీమ యాసల్లోనే కుప్పలు తెప్పలుగా సినిమాలు వస్తున్న తరుణంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ట్రెండ్ మారింది. సినిమాలు తీసే విధానం మారిపోయింది. టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఎంతలా అంటే ప్రతీ సినిమాలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

Also Read: కేసీఆర్ ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేశారా?

సినిమాలో హీరో పాత్రకానీ… హీరోయిన్ క్యారెక్టర్ కానీ తెలంగాణ యాసలో పెడితే థియేటర్లలో ఆ సినిమాకు వచ్చే స్పందన అంతా ఇంతాకాదు.. శేఖర్ కమ్ముల అయితే తన సినిమా ‘ఫిదా’ నుంచి ‘లవ్ స్టోరీ’ మొత్తం తెలంగాణ బ్యాక్ డ్రాప్ యే. ఇక ఇటీవల తీసిన భీమ్లానాయక్ మూవీలో విలన్ ‘రానా’ కూడా తెలంగాణకు చెందిన వ్యక్తిగానే చూపించారు. ఇక రాబోయే ‘ఆర్ఆర్ఆర్’లో కొమురంభీంగా జూనియర్ ఎన్టీఆర్ ఫక్తు తెలంగాణ మాండలికం మాట్లాడే వ్యక్తిగానే నటిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయి. ఇలా ఇప్పుడు తెలంగాణ నేపథ్యంపై సినిమాలు తీయడంపైనే డైరెక్టర్లు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. అదే తెలంగాణ సంస్కృతికి టాలీవుడ్ ఇస్తున్న గౌరవమని చెప్పొచ్చు. మునుపటిలా ఇప్పటికీ తెలంగాణ భాషకు గౌరవం పెరిగిందని భావించవచ్చు.

Also Read: టాలీవుడ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా మోడీ – కేసీఆర్ !