https://oktelugu.com/

Tollywood Jagan: చిరంజీవి, మహేష్, ప్రభాస్.. ఆఖరుకు బామ్మర్ధి విష్ణు వచ్చినా కరగవా జగన్?

Tollywood Jagan: ఏపీ సీఎం జగన్ కు ఏమైంది? ఇప్పుడు ఇదే ప్రశ్న టాలీవుడ్ వర్గాలకు నిద్ర లేకుండా చేస్తోంది. టాలీవుడ్ అంతా కదిలివచ్చినా ఆయన మాత్రం తన పంతం వీడకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వారం రోజుల్లో టాలీవుడ్ శుభవార్త వింటుందని మొన్నటికి మొన్న జగన్ ను కలిసిన తర్వాత చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి తదితరులు ప్రకటించారు. మంత్రి పేర్ని నాని కూడా పక్కనే ఉండి నిర్ధారించారు.కానీ ఏమైంది.. వారం దాటింది. సినీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 16, 2022 / 03:28 PM IST
    Follow us on

    Tollywood Jagan: ఏపీ సీఎం జగన్ కు ఏమైంది? ఇప్పుడు ఇదే ప్రశ్న టాలీవుడ్ వర్గాలకు నిద్ర లేకుండా చేస్తోంది. టాలీవుడ్ అంతా కదిలివచ్చినా ఆయన మాత్రం తన పంతం వీడకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వారం రోజుల్లో టాలీవుడ్ శుభవార్త వింటుందని మొన్నటికి మొన్న జగన్ ను కలిసిన తర్వాత చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి తదితరులు ప్రకటించారు. మంత్రి పేర్ని నాని కూడా పక్కనే ఉండి నిర్ధారించారు.కానీ ఏమైంది.. వారం దాటింది. సినీ ఇండస్ట్రీ సమస్యలపై జగన్ సర్కార్ లో ఉలుకు లేదు పలుకూ లేదు. అసలెందుకు జగన్ టాలీవుడ్ సమస్యలపై స్పందించడం లేదన్నది అసలు ప్రశ్న.

    Tollywood Jagan:

    ఇప్పటికే జగన్ శుభవార్త చెబుతాడని వరుణ్ తేజ్ ‘గని’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీని జగన్ ప్రకటిస్తాడని తెలిసి పెద్ద, చిన్న సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమయ్యాయి.అయితే టాలీవుడ్ అంతా రెడీ అవుతున్నా.. జగన్ సర్కార్ లో అలికిడీ లేదు. వరాలు లేవు.

    Also Read:  రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

    చిరంజీవి వచ్చినా.. మహేష్ బతిమిలాడినా.. ప్రభాస్ వేడుకున్నా.. ఆఖరుకు బామ్మర్ధి మంచు విష్ణు వచ్చి కలిసినా కూడా జగన్ లో స్పందన లేదు. టాలీవుడ్ సమస్యలు తీర్చాలన్న మూవ్ మెంట్ లేదు.

    అయితే జగన్ ఇదంతా జనసేనాని పవన్ కళ్యాణ్ పై పగతోనే చేస్తున్నాడని.. ఆయన సినిమా ‘భీమ్లా నాయక్’ను దెబ్బకొట్టేందుకే థియేటర్ల అక్యూపెన్సీ, టికెట్ రేట్లపై జాప్యం చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాజకీయాలే టాలీవుడ్ కోరికలు తీరకపోవడానికి కారణమంటున్నారు.

    Also Read:   యూపీలో బీజేపీకి ఓటేయని వారి ఇళ్లను బుల్ డోజర్లతో తొక్కిస్తాం: రాజాసింగ్ హెచ్చరిక

    ఎంత మంది కలిసినా.. ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా జగన్ లో కనీస కదలిక లేకపోవడం ఇప్పుడు టాలీవుడ్ కు మింగుడు పడడం లేదు. జగన్ జాప్యంతో టాలీవుడ్ కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడూ అని టాలీవుడ్ ఆశతో ఎదురుచూస్తోంది. టాలీవుడ్ పై జగన్ ఎందుకు పగబట్టాడన్నది అంతుబట్టడం లేదు.