Pawan Birthday : ప‌వ‌ర్ స్టార్ పై ప్ర‌శంస‌ల జల్లు.. సినీ ప్ర‌ముఖులు ఎవ‌రేమ‌న్నారంటే..?

  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 50వ ప‌డిలో అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ప‌వ‌న్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియా ప‌వ‌న్నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగుతోంది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడికి ప్రేమ పూర్వ‌క‌మైన శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌వ‌న్ తో ఉన్న ఫొటోలు షేర్ చేసిన చిరు.. ‘‘చిన్నప్పటి నుంచీ సమాజం గురించే కల్యాణ్ ప్రతీ ఆలోచ‌న‌. ప్ర‌తీ అడుగు ప‌ది మందికి మేలు జ‌ర‌గాల‌ని ప్ర‌తీ క్ష‌ణం ప‌రిత‌పించే నిప్పు […]

Written By: Bhaskar, Updated On : September 2, 2021 2:30 pm
Follow us on

 

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 50వ ప‌డిలో అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ప‌వ‌న్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియా ప‌వ‌న్నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగుతోంది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడికి ప్రేమ పూర్వ‌క‌మైన శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌వ‌న్ తో ఉన్న ఫొటోలు షేర్ చేసిన చిరు.. ‘‘చిన్నప్పటి నుంచీ సమాజం గురించే కల్యాణ్ ప్రతీ ఆలోచ‌న‌. ప్ర‌తీ అడుగు ప‌ది మందికి మేలు జ‌ర‌గాల‌ని ప్ర‌తీ క్ష‌ణం ప‌రిత‌పించే నిప్పు క‌ణం క‌ల్యాణ్‌. అత‌ని ల‌క్ష్యం నెర‌వేరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ, తోడ‌బుట్టిన ఆశ‌యానికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు’’ అని పోస్టు చేశారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కూడా పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘సినీ కథానాయకులు, ప్రజా నాయకులు పవన్ కల్యాణ్ గారికి హృద‌య‌పూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీరు నిండు నూరేల్లూ ఆరోగ్య ఆనందాల‌తో వ‌ర్థ‌లిల్లాల‌ని మ‌నసారా కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు చంద్రబాబు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి చోటా.. ప్రతి విషయంలోనూ స్టార్.. బంగారం లాంటి మనసున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ నుంచి మరెన్నో సినిమాలు రావాలి. మా అందరినీ ఇంకెంతగానో అలరించాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.

తెలుగు సినీ హీరో రవితేజ పవర్ కు గ్రీటింగ్స్ చెప్పారు. ‘‘నా ఆప్తమిత్రుడు, గొప్ప వ్య‌క్తిత్వం క‌లిగిన వ్య‌క్తి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఆయురారోగ్యాల‌తో నువ్వు ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను’’ అని పోస్టు చేశారు మాస్ రాజా.

అల్లు అర్జున్ కూడా పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్ డే మై పవన్ కల్యాణ్. ఈ రోజుతోపాటు రానున్న ఏడాదంతా మీకు సంతోషం, ఆనందం కలగాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశాడు.

‘‘నిజం, నిజాయితీ, సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. పరిశ్రమలో నాకెంతో ఇష్టమైన వారిలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’అని రచయిత వక్కంతం వంశీ పోస్టు చేశారు.

‘‘మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేనికీ తలొగ్గకూడదు అనేదాన్ని మీ నుంచే నేర్చుకున్నాను. మీరు మాలో నింపిన స్ఫూర్తికి ధన్యవాదాలు’’ అని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.

‘‘ఒక న‌టుడిగా, నాయ‌కుడిగా ఎన్నో మిలియ‌న్ల మందిలో స్ఫూర్తి, ప్రేర‌ణ నింపిన మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ మ్యాన్‌, ప్రియ‌మైన సోద‌రుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు’’ అని దర్శకుడు మెహర్ రమేష్ గ్రీటింగ్స్ చెప్పారు.