https://oktelugu.com/

ప్రచారానికి నేటితో తెర.. పోలింగ్‌ శాతమే కీలకం

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా కొనసాగుతున్న ప్రచారానికి నేటి సాయంత్రంతో బ్రేక్‌ పడబోతోంది. మూడు వారాలుగా పార్టీలు ప్రచారంలో చెమటోడ్చాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీలు తీవ్రంగా శ్రమించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడ్డారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఇక ఇప్పుడు బంతి ఓటర్ల కోర్టులో ఉందనేది స్పష్టం. అసలే కరోనా టైమ్‌లో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో […]

Written By: Srinivas, Updated On : April 15, 2021 12:08 pm
Follow us on

Tirupati By Election 2021
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా కొనసాగుతున్న ప్రచారానికి నేటి సాయంత్రంతో బ్రేక్‌ పడబోతోంది. మూడు వారాలుగా పార్టీలు ప్రచారంలో చెమటోడ్చాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీలు తీవ్రంగా శ్రమించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడ్డారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఇక ఇప్పుడు బంతి ఓటర్ల కోర్టులో ఉందనేది స్పష్టం.

అసలే కరోనా టైమ్‌లో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ శాతం ఎలా నమోదు కాబోతుందో అర్థం కాకుండా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ఎంతవరకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారా అనే ప్రశ్న కూడా వస్తోంది. మొత్తంగా ఆ పోలింగ్‌ శాతమే విజేతను నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.

నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుండడంతో నేతలంతా తిరుగు పయనం కానున్నారు. దీంతో తెరవెనుక రాజకీయాలు చేసేందుకు రెడీ అయ్యారు. పంపకాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పోలింగ్‌ శాతం.. ధన ప్రవాహం.. ప్రలోభాలు.. సంక్షేమ పథకాలు తొలగిస్తామనే హెచ్చరికలు ప్రభావం చూపబోతున్నాయి.

చివరి నిమిషంలో ప్రచారానికి వస్తానని అనుకున్న జగన్‌ కూడా ప్రచారానికి రాలేకపోయారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయన తన ప్రచారానికి విరమించుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా హోం క్వారంటైన్‌లో ఉండిపోయారు. దీంతో ఈ ఇద్దరూ ప్రచారంలో పాల్గొనలేదు. పవన్‌ ఒక్కరోజు మాత్రమే సభలో పాల్గొన్నారు. తర్వాత పాల్గొనలేదు. ఇక ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడం పార్టీలకు పెద్ద టాస్క్‌లా మారింది.