https://oktelugu.com/

తగ్గుతున్న కరోనా కేసులు:కేసీఆర్

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను సూచించారు. వ్యాధికి సంబంధించి అనుమానితులపై నిఘా ఉంచాలని, వారు ఎవరెవరిని కలిశారనేది ముఖ్యమని, అందరికీ సంబంధించిన సమాచారం తీసుకోవాలన్నారు. అనుమానితుల్లో ఏ ఒక్కరూ తప్పించుకొని తిరగడానికి వీల్లేదన్నారు. కంటెయిన్‌ మెంట్‌ జోన్లపై దృష్టి సారించడం ద్వారా మిగిలిన ప్రాంతాలను విస్మరించొద్దని, జోన్లతో పాటు వాటిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనూ పర్యవేక్షణ సాగాలన్నారు. పలుచోట్ల లాక్‌ డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, పూర్తిగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 23, 2020 7:03 pm
    Follow us on

    తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను సూచించారు. వ్యాధికి సంబంధించి అనుమానితులపై నిఘా ఉంచాలని, వారు ఎవరెవరిని కలిశారనేది ముఖ్యమని, అందరికీ సంబంధించిన సమాచారం తీసుకోవాలన్నారు. అనుమానితుల్లో ఏ ఒక్కరూ తప్పించుకొని తిరగడానికి వీల్లేదన్నారు. కంటెయిన్‌ మెంట్‌ జోన్లపై దృష్టి సారించడం ద్వారా మిగిలిన ప్రాంతాలను విస్మరించొద్దని, జోన్లతో పాటు వాటిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనూ పర్యవేక్షణ సాగాలన్నారు. పలుచోట్ల లాక్‌ డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, పూర్తిగా నివారించాలన్నారు. జన సంచారాన్ని పూర్తిగా నిరోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.

    కరోనా వైరస్‌ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

    “బాధితులతో కాంటాక్టు ఉన్న వ్యక్తులందరనీ క్వారంటైన్‌ చేశాం. దీని కారణంగా వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అరికట్టగలిగాం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విజయవంతంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదేవిధంగా సహకరించి నిబంధనలు పాటిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.