Telangana Yadadri: కలియుగ దైవం వెంకటేశ్వరుడు. తిరుమలను వైకుంఠంగా పిలుస్తారు. అలాంటి తిరుమల మనకు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దీంతో యాదాద్రిని తిరుమలగా మలచేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో ఆలయాన్ని పునర్నిర్మించే క్రమంలో ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉండి ఆలయ పనులు పర్యవేక్షించారు. ఆలయ నిర్మాణానికి పెద్ద ఎత్తు నిధులు కేటాయించి దాన్ని అద్భుతంగా చెక్కించారు. అహర్నిశలు శ్రమించి ఆలయ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేయించారు.
యాదాద్రిని చూస్తుంటే అబ్బురపరుస్తోంది. శిల్పకళా సౌందర్యం, దేవాలయాల శోభ ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి స్వయంగా పనులు చూసుకోవడంతో నాణ్యత విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా నిర్మాణాలు పూర్తి చేయించారని తెలుస్తోంది. నిష్ణాతులైన నిపుణులు ఆలయాన్ని తీర్చిదిద్దిన తీరు అబ్బురపరుస్తోంది. కళారీతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి సౌకర్యాల కల్పనలోనూ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
యాదాద్రి నిర్మాణం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఆలయం సుందరంగా తీర్చిదిద్దడంలో చూపిన నైపుణ్యం చూస్తుంటే విష్ణు పుష్కరిణి, దీపస్తంభం, అద్దాల మండపం, కాటేజీలు వంటివి నిర్మించారు. మెట్లు ఎక్కలేని వారికి ఎస్కలేటర్లు ఏర్పాలు చేశారు. నేడు ఆలయాన్ని ప్రారంభించడంతో భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు. రోజు భక్తులకు అన్ని విషయాల్లో లోటు రాకుండా చూసుకుంటున్నారు.
ఆలయంలో అందరికి వేద ఆశీర్వచనం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ భక్తులకు రూ.516 చెల్లిస్తే వేద ఆశీర్వచనం అందించేందుకు వీలు కల్పించారు. శని, ఆదివారాల్లో దాదాపు 30 వేల మందికి వేద ఆశీర్వచనం అందించనున్నారు. భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఉండేందుకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో తిరుమలకు ప్రతిరూపంగా యాదాద్రి కొనసాగేందుకు కావాల్సిన వసతులు కల్పించడం గమనార్హం.
Also Read: Kejriwal Kodandaram: ఆప్ పార్టీలో టీజేఎస్ విలీనం..? కోదండరాంతో కేజ్రీవాల్‌కు ఒరిగేదేంటి..?
Recommended Video: