Tinkesh Kaushik: ఎవరెస్ట్ ఎక్కిన తొలి వికలాంగుడు.. ఎలా సాధ్యమైందంటే?

గోవాకు చెందిన టింకేశ్ కౌశిక్ (30) దివ్యాంగుడు. పట్టుదలతో ఆయన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను అధిరోహించి చరిత్ర సృష్టించాడు. శారీరక వైకల్యాలు ఉన్నప్పటికీ మే 11న ఛాలెంజ్ జర్నీని పూర్తి చేశాడు.

Written By: Neelambaram, Updated On : May 24, 2024 8:25 am

Tinkesh Kaushik

Follow us on

Tinkesh Kaushik: శరీరంలో ఏదైనా ఒక అంగం కోల్పోతే మిగతా అంగాలకు రెట్టింపు శక్తిని సమకూరుస్తాడు భగవంతుడు అని చాలా మందికి తెలిసిన విషయమే. దివ్యాంగులను చూస్తే ఇది అర్థం అవుతుంది. వారు చేయాలనుకున్న పనిని క్రమ శిక్షణతో చేస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం సాధారణ వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటుంది. సాధారణ వ్యక్తులకే సాధ్యం కాని పనిని ఒక దివ్యాంగుడు చేసి చూపించాడు. ఔర ఔర అనిపించుకున్నాడు.

గోవాకు చెందిన టింకేశ్ కౌశిక్ (30) దివ్యాంగుడు. పట్టుదలతో ఆయన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను అధిరోహించి చరిత్ర సృష్టించాడు. శారీరక వైకల్యాలు ఉన్నప్పటికీ మే 11న ఛాలెంజ్ జర్నీని పూర్తి చేశాడు. 30 ఏళ్ల టింకేష్ ట్రిపుల్ వికలాంగుడు (రెండు కాళ్లు, చేతులు లేని వ్యక్తి) తొమ్మిదేళ్ల వయసులో హరియాణాలో కరెంట్ షాక్ ప్రమాదంలో ఆయన దివ్యాంగుడిగా మారాడు. అందులో అతను రెండు కాళ్లు, మోకాలి కింద ఒక చేతిని కోల్పోయాడు. కృత్రిమ అవయవం పొందిన తర్వాత టింకేష్ గోవా వెళ్లాడు. అక్కడ ఫిట్ నెస్ కోచ్ గా పనిచేశాడు.

సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్ కు చేరుకున్న తొలి ట్రిపుల్ వికలాంగుడిగా టింకేశ్ నిలిచింది. ఫిట్ నెస్ కోచ్ కావడంతో ఎక్కడం సులభమని మొదట్లో భావించానని, కానీ ఎన్నో సవాళ్లు ఎదురవడంతో అది అంత సులువు కాదని గ్రహించానని టింకేశ్ చెప్పాడు. తనకు అంగం లేకపోవడం, ప్రోస్థెసిస్ కారణంగా మొదటి రోజు చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పాడు.

‘ట్రెక్కింగ్ నాకు సవాలుగా అనిపించింది. మొన్న నేను చేయాలని చెప్పాను. ఇది చేయదగిన ట్రెక్కింగ్. కానీ మొన్న నేను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. మధ్యలో పలుమార్లు ఆరోగ్యం క్షీణించింది. మౌంటెన్ బౌట్ కూడా ఎదురైంది. కానీ మానసిక బలాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా, నేను ప్రయాణాన్ని పూర్తి చేశాను.’ అని టింకేశ్ చెప్పారు.

ప్రయాణం ముగిసిన తర్వాత టింకేష్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ, ‘ఈ రోజు, మే 11, 2024 న, నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు ట్రెక్కింగ్ ఛాలెంజ్ పూర్తి చేశాను. 90 శాతం లోకోమోటర్ వైకల్యంతో ఈ ఘనత సాధించాను. అది కూడా తొలి ట్రిపుల్ హీరోగా చాలా ఎమోషనల్ మూమెంట్. నేను నా కోసం చేశాను, నేను ఒక ప్రయోజనం కోసం చేశాను. దీన్ని నిజం చేయడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.’ అని ఆయన కృతజ్ఞతలు చెపపారు.