https://oktelugu.com/

వైసీపీ నేతకు బెదిరింపు కాల్స్ భయం?

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీలో కొందరి నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీనిపై అటు అధిష్టానం, ఇటు పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో వారిలో అదైర్యం కలుగుతోంది. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు వచ్చిన బెదిరింపు కాల్ పై ఆందోళన నెలకొంది. చంపుతామని బెదిరించడమే కాకుండా ఎలా చంపుతామో అని కూడా పోస్టు పెట్టడంతో ఆయనలో భయం పట్టుకుంది. కొద్దిరోజుల క్రితం నందగిరి సుబ్బయ్య అనే టీడీపీ నేతను నరికి […]

Written By: , Updated On : July 3, 2021 / 05:38 PM IST
Follow us on

Ramesh Yadavఆంధ్రప్రదేశ్ లోని వైసీపీలో కొందరి నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీనిపై అటు అధిష్టానం, ఇటు పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో వారిలో అదైర్యం కలుగుతోంది. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు వచ్చిన బెదిరింపు కాల్ పై ఆందోళన నెలకొంది. చంపుతామని బెదిరించడమే కాకుండా ఎలా చంపుతామో అని కూడా పోస్టు పెట్టడంతో ఆయనలో భయం పట్టుకుంది. కొద్దిరోజుల క్రితం నందగిరి సుబ్బయ్య అనే టీడీపీ నేతను నరికి చంపిన వైనంపై విమర్శలు రేగుతున్న క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీపై వచ్చిన బెదిరింపు కాల్ వైరల్ అవుతోంది.

రమేష్ యాదవ్ వైసీపీలో చురుకైన నేతగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠం ఆశించినా దక్కలేదు. దీంతో అధినేత జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. దీంతో రమేష్ యాదవ్ ప్రొద్దుటూరులో ర్యాలీ నిర్వహించగా అది సొంత పార్టీలోని వారికే నచ్చలేదు. దీంతో ఆయనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రమేష్ యాదవ్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. తనకు ప్రాణభయం ఉందని పార్టీకి,పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో ఆయనలో భయం ఏర్పడుతోంది. తనపై నిజంగానే దాడి జరుగుతుందేమోనని నిత్యం భయపడుతున్నట్లు సమాచారం.

రమేష్ యాదవ్ కు వచ్చిన బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. అది ఇంటర్నెట్ కాల్స్ ద్వారా వచ్చిందని, ఎక్కడి నుంచి వచ్చిందో తేలుస్తామిన పోలీసులు చెబుతున్నారు. అటుపోలీసులు కాని ఇటు అధిష్టానం కాని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సొంత పార్టీ వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిస్థితి ఇలాగ ఉంటే భవిష్యత్తులో ఎలా తిరిగేదని ప్రశ్నిస్తున్నారు. ప్రాణభయంతో పార్టీ కోసం పని చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని నేతలు భయపడుతున్నారు. భవిష్యత్తులో వైసీపీ క్యాడర్ ఎదగడం ఎలా అని మథనపడుతున్నారు.

రమేష్ యాదవ్ పరిస్థితి ఎవరికి మంచిది కాదని పార్టీ నేతలే చెబుతున్నారు. ఆయనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎంత కాలం భయపడుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతామని అడుగుతున్నారు. అసలు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదని చెబుతున్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చి తనకున్న భయం పోగొట్టేలా చూడాలని కోరుతున్నారు. వైసీపీ నేతలకు ఉన్న భయం పోగొట్టాలని సూచించారు.