https://oktelugu.com/

లాయర్లను బెదిరిస్తారా? ఏపీ పోలీసులపై హైకోర్టు ఫైర్‌‌

ఏపీ పోలీసులు రోజుకో తీరులో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారు ఏం చేస్తున్నారో ఏమో తెలియక అటు ప్రభుత్వానికీ తలవంపులు తెస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తీవ్ర వివాదాస్పదమవుతున్న హెబియస్‌ కార్పస్ పిటిషన్ల విషయంలో పోలీసుల తీరుపై పలుమార్లు హైకోర్టు సీరియస్‌ అయింది. ఇలాంటి ఓ కేసును సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. ఇప్పుడు తాజాగా మరో కేసు విషయంలో పోలీసులు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని లాయర్లను […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 11:55 AM IST
    Follow us on

    ఏపీ పోలీసులు రోజుకో తీరులో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారు ఏం చేస్తున్నారో ఏమో తెలియక అటు ప్రభుత్వానికీ తలవంపులు తెస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తీవ్ర వివాదాస్పదమవుతున్న హెబియస్‌ కార్పస్ పిటిషన్ల విషయంలో పోలీసుల తీరుపై పలుమార్లు హైకోర్టు సీరియస్‌ అయింది. ఇలాంటి ఓ కేసును సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. ఇప్పుడు తాజాగా మరో కేసు విషయంలో పోలీసులు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని లాయర్లను బెదిరించినట్లు హైకోర్టు దృష్టికి వచ్చింది.

    Also Read: చంద్రబాబుకు వల్లభనేని వంశీ స్వాగతం.. తమ్ముళ్ల షాక్

    రాష్ట్రంలో వైసీపీ గద్దెనెక్కి 16 నెలలు గడించింది. అప్పటి నుంచి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల వ్యవహారం తరచూ తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు తమ కుటుంబ సభ్యులను అపసంహరించారని పలువురు మహిళలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాఖలు చేసిన పిటిషన్లలో పోలీసులు కోర్టుకు సరైన వివరాలు సమర్పించడంలో విఫలం కావడమే కాకుండా పలు సందర్భాల్లో అనుమానాస్పదంగా దర్యాప్తు చేసినట్లు తేలింది. దీంతో గుంటూరు కేసులో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇతర జిల్లాల్లో నమోదైన కేసుల విషయంలోనూ పలు సందర్భాల్లో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

    హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల విషయంలో హైకోర్టులో బాధితులుగా మారుతున్న పోలీసులు.. ఈ పిటిషన్లను ఉపసంహరించుకోవాలంటూ న్యాయవాదులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారం తిరిగి హైకోర్టుకు చేరడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

    Also Read: విద్యార్థులకు జగనన్న కానుక ఇదీ..

    హెబియస్ కార్పస్‌ పిటిషన్ల ఉపసంహరణకు లాయర్లను బెదిరించడమేంటని పోలీసులను ప్రశ్నించింది. ఇది లాయర్లను కాదు వ్యవస్థను భయపెట్టడమే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవాదులు రాకపోతే ఇక కోర్టులు మూసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్టు ఈ మధ్య కాలంలో రెండోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లయింది. మరి ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకుంటారా లేదో చూడాలి.