
AP MLC Polls: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో అధికార పార్టీ వైసీపీ పని చేసిన వారికి పదవులు అందజేసేందుకు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యేల కోటాలో రాయలసీమకు చెందిన ఇద్దరు నేతలకు అవకాశం కల్పించింది. నంద్యాలకు చెందిన ఇసాక్ బాషా, బద్వేల్ ఇన్ చార్జి దేవసాని చిన్న గోవిందరెడ్డి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం విధేయుడిగా ఉన్న వారికి సముచిత స్థానం దక్కడం తెలిసిందే.
పార్టీ కోసం పనిచేసిన వారికే పెద్దపీట వేస్తామని ఇదివరకే జగన్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. జగన్ మదిలో ఉన్న వారికే టికెట్లు ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశలు పెంచుకున్నారు. అయితే అందరికి అవకాశాలు రావని తెలుసుకోవడంతో అధినేత మదిలో ఎవరున్నారో వారికే టికెట్ ఖాయమని తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే జాబితా తయారు చేసినట్లు ప్రచారం సాగుతోంది.
2019 ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. దీని కోసం కసరత్తు పూర్తి చేశారు. వివిధ స్థాయిల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జగన్ జాబితా ఖరారుపై వడపోత కార్యక్రమం నిర్వహిస్తున్నారు.