Dark Tourism : సాధారణంగా మనలో చాలామందికి ప్రకృతి అందాలను చూడడం చాలా ఇష్టం.. ఇందుకోసం ఎక్కడికైనా వెళ్తాం.. మన ఆర్థిక స్తోమతను బట్టి ఖర్చు చేస్తాం. కానీ ప్రకృతి అందాలను కాకుండా.. ప్రకృతి విపత్తులను చూడ్డానికి వెళ్తే.. యుద్ధ సమయంలో వాతావరణం ఎలా ఉందో వీక్షించడానికి వెళ్తే.. అదేంటి ఇలా కూడా ఉంటారా.. అనే ప్రశ్న మీలో వ్యక్తమౌతూ ఉండొచ్చు.. కానీ ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఈ కాలంలో ఇలాంటి వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీనినే డార్క్ టూరిజం అని పిలుస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ టూరిజం మార్కెట్ విలువ పెరిగిపోతోంది. ఇలాంటి ప్రదేశాలను చూసేవారి సంఖ్య రెట్టింపవుతుంది. మారణ హోమ క్షేత్రాలను చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతున్నారంటే.. డార్క్ టూరిజం మీద ఆసక్తి ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. డార్క్ టూరిజం విలువ ఈ ఏడాది 2.55 లక్షల కోట్ల వరకు ఉంటుందని పలు పర్యాటకరంగ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇది దాదాపుగా తెలంగాణ బడ్జెట్ కు సమానంగా ఉంది. రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధాన్ని చూసేందుకు యువత ఏకంగా లక్షలు ఖర్చు చేసింది. కేరళలో వయనాడ్ ప్రాంతంలో సంభవించిన వరదలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీనికోసం భారీగానే ఖర్చు చేశారు. ఇదంతా ఎందుకు అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. విషాద ఘటనలు, చారిత్రక అంశాలు, చీకటి అధ్యయనాలపై ఆసక్తి వల్లే డార్క్ టూరిస్టులు పెరుగుతున్నారని.. ప్రపంచం మొత్తం తెగ తిరుగుతున్నారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. 2034 నాటికి డార్క్ టూరిజం విలువ 3.46 లక్షల కోట్లకు చేరుకుంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది..
అందు గురించే వెళ్తున్నారట..
చరిత్రలో నిలిచిపోయిన చీకటి అధ్యాయాలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. చరిత్రలో జరిగిన తప్పుల గురించి తెలుసుకోవాలని కోరిక చాలామందిలో కలుగుతుంది. అనుభవం సంపాదించుకోవడం కోసం, విజ్ఞానాన్ని పొందడం కోసం చాలామంది డార్క్ టూరిజం వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. దారుణమైన పరిస్థితులు, విపత్తులకు దారి తీసిన ఘటనల గురించి తెలుసుకునేందుకు డార్క్ టూరిజం ఉపయోగపడుతుంది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంవత్సరాల నుంచి డార్క్ టూరిజం అభివృద్ధి చెందుతోంది. డార్క్ టూరిజం అనేది ఘోరమైన, దారుణమైన ఘటనకు గుర్తుగా మిగిలిన ఆనవాళ్లను చూడటం. ఈ జాబితాలో విషాదాల నుంచి మొదలుపెడితే మరణాల వరకు ఉంటాయి.. యుద్ధ వాతావరణం, న్యూక్లియర్ విస్ఫోటనాలు జరిగిన ప్రదేశాలు డార్క్ టూరిజం పరిధిలోకి వస్తాయి. గ్రహాంతరవాసులు, గాలిలో ఎగిరే వింత వస్తువులు కూడా దీని కిందికే వస్తాయి. మనదేశంలో కూడా డాకు టూరిజం అభివృద్ధి చెందుతోంది.. అమెరికాలోని ఓ సర్వే ప్రకారం 82 శాతం మంది పాస్ పోర్ట్ కలిగిన ప్రయాణికులు ఏదో ఒక డార్క్ ప్రదేశాన్ని సందర్శించినట్టు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కేరళ రాష్ట్రంలో భారీగా వరదలు సంభవించడం.. ఆ ప్రదేశాలను చూడడానికి భారీగా ప్రజలు రావడం.. డార్క్ టూరిజనికి పెరుగుతున్న ఆదరణకు సంకేతం.
విపరీతంగా అభివృద్ధి చెందుతోంది
అమెరికా, బ్రెజిల్, కెనడా, లాటిన్ అమెరికా, మెక్సికో, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, రష్యా, ఇటలీ, రొమేనియా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జపాన్, చైనా, భారత్, గల్ఫ్ కార్పొరేషన్ లో దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్, దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో డార్క్ టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందుతోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: This year market value of dark tourism industry rs 2 55 lakh crore
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com