Homeజాతీయ వార్తలుLook back politics 2024: ఈ ఏడాది ఎన్నికల సమరం మామూలుగా లేదు.. ఈ రాష్ట్రాల్లో...

Look back politics 2024: ఈ ఏడాది ఎన్నికల సమరం మామూలుగా లేదు.. ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో.. ఏ పార్టీలు గెలిచాయంటే?

Look back politics 2024:     కాలగర్భంలో 2024 మరికొద్ది రోజుల్లో కలవనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది దేశంలో జరిగిన రాజకీయ పరిణామక్రమలను ఒకసారి పరిశీలిస్తే.. ఈ ఏడాది మనదేశంలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. వీటిలో ఐదు రాష్ట్రాలలో బిజెపి, ఎన్డీఏ అధికారాన్ని దక్కించుకుంది.. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలలో ఎన్నికల జరిగాయి.

అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బిజెపి మరొకసారి తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. ఏప్రిల్ 19న ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో ప్రేమ ఖండు ముఖ్యమంత్రిగా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రంలో ప్రముఖమైన సిక్కిం లో మరోసారి క్రాంతికారి మోర్చా అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమంగ్ కొనసాగుతున్నారు. గతంలోను ఈయన ముఖ్యమంత్రిగా పని చేశారు.

దక్షిణాది రాష్ట్రాలలో ప్రముఖంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మే 13న అక్కడి అసెంబ్లీకి ఎన్నికల నిర్వహించారు. ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీని టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో ని కూటమి పరాజయం పాలు చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని పార్టీ ఓడిపోయింది. సుదీర్ఘకాలం నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. మే 13, జూన్ 1న ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బిజు జనతాదళ్ అధికారంలో ఉంది. ఆ పార్టీని బిజెపి ఓడించింది. బిజెపి నాయకుడు మోహన్ చరణ్ మాంఝీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నాయి. అనేక తర్జనభర్జనల తర్వాత సెప్టెంబర్ 19, అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికల నిర్వహించారు..ఈ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కొనసాగేది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధించింది. ఓమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఉత్తరాది రాష్ట్రాలలో ప్రముఖమైన హర్యానాలో అక్టోబర్ ఐదు న అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. గతంలో ఈ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది. ఈసారి కూడా బిజెపి తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. నయాబ్ సింగ్ షైనీ ముఖ్యమంత్రిగా మరోసారి తన పీఠాన్ని బలోపేతం చేసుకున్నారు.

బీహార్ నుంచి విడిపోయి రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్ లో నవంబర్ 13, నవంబర్ 20 తేదీలలో ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా అధికారాన్ని దక్కించుకున్నాయి.. హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై.. బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మహారాష్ట్ర లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపి, శివసేన (ఏక్ నాథ్ షిండే), ఎన్సిపి (అజిత్ పవార్) ఆధ్వర్యంలోని కూటమి విజయం సాధించింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండగా.. ఈసారి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular