AP Employees: ఫాఫం.. ఏపీ ఉద్యోగుల పరిస్థితి ఇలా తయారైందేంటి?

AP Employees: ఉన్నది కాస్త ఊడప్పా అయ్యిందంటే ఇదే.. అసలే పీఆర్సీతో జీతాలు తగ్గిపోతున్నాయని గోలపెడుతూ సమ్మెకు రెడీ అయిన ఏపీ ఉద్యోగులతో జగన్ సర్కార్ చెడుగుడు ఆడుతోంది. ఏపీ ఉద్యోగులను నయానో భయానో ఎలాగైనా సరే ఒప్పించి మెప్పించాలని ఠక్కుఠమార విద్యలన్నీ వేస్తోంది. తాజాగా కొత్త జీతాలతో ఉద్యోగుల్లోనే విభజన తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలనేతలు నెత్తినోరు బాదుకుంటున్నారు. పీఆర్సీ ఉద్యమం, చర్చలు ముగిసే వరకూ తమకు పాత జీతాలే ఇవ్వాలని వారం […]

Written By: NARESH, Updated On : January 26, 2022 4:58 pm
Follow us on

AP Employees: ఉన్నది కాస్త ఊడప్పా అయ్యిందంటే ఇదే.. అసలే పీఆర్సీతో జీతాలు తగ్గిపోతున్నాయని గోలపెడుతూ సమ్మెకు రెడీ అయిన ఏపీ ఉద్యోగులతో జగన్ సర్కార్ చెడుగుడు ఆడుతోంది. ఏపీ ఉద్యోగులను నయానో భయానో ఎలాగైనా సరే ఒప్పించి మెప్పించాలని ఠక్కుఠమార విద్యలన్నీ వేస్తోంది. తాజాగా కొత్త జీతాలతో ఉద్యోగుల్లోనే విభజన తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

AP Employees

ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలనేతలు నెత్తినోరు బాదుకుంటున్నారు. పీఆర్సీ ఉద్యమం, చర్చలు ముగిసే వరకూ తమకు పాత జీతాలే ఇవ్వాలని వారం క్రితమే ప్రభుత్వానికి చెప్పినట్లు ఉద్యోగ నేతలు వాపోతున్నారు. కానీ ప్రభుత్వం కుట్ర పూరితంగా కొత్త జీతాలని ఒకసారి.. సీఎఫ్ఎంఎస్ అని..హెచ్ఆర్ఎంఎస్ అని మరోసారి చెబుతూ గందరగోళం సృష్టిస్తోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అసలు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల్లో అసహనం కలిగేలా చేసి ఉద్యమం దెబ్బతినేలా కుట్ర పన్నుతున్నారని ప్రభుత్వంపై ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు..

ఈనెల జీతం రాకుండా ప్రభుత్వం చూస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు ఆపితే ఊరుకునేది లేదంటున్నారు. మాకు వేతనాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతున్నా పీఆర్సీ ఇచ్చేది జీతాలు తగ్గించడానికా? లేక పెంచడానికా? అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. మొత్తంగా పీఆర్సీతో తగ్గిందో పెరిగిందో తెలియక.. ప్రభుత్వం ఆడుతున్న ఆటలతో ఉద్యోగులే డిఫెన్స్ లో పడిపోతున్నారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను ఉద్యోగులు మొదలుపెట్టారు.

Tags