https://oktelugu.com/

Chandrababu Ring: చంద్రబాబు చేతి వేలికి ఉన్న ఉంగరం వెనుక పెద్ద కథే ఉందే?

Chandrababu Ring: 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబుకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. టీడీపీ చరిత్రలోనే.. అంతకంటే ఎక్కువ.. ఏపీ చరిత్రలోనే అత్యంత చిత్తుగా ఓడిపోయాడు ఈ పెద్దమనిషి. జగన్ ధాటికి టీడీపీ కకావికలమైంది.ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.. సాధారణంగా దేవుళ్లను పెద్దగా నమ్మని.. నాస్తికుడు అని పేరున్న చంద్రబాబుకు అధికారం పోగానే అన్ని నమ్మకాలు వచ్చి పడుతున్నాయి. కొంచెం దైవభక్తి కూడా పెరిగిపోయింది.ఈ మధ్యన చంద్రబాబు చాలా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2022 / 06:59 PM IST
    Follow us on

    Chandrababu Ring: 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబుకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. టీడీపీ చరిత్రలోనే.. అంతకంటే ఎక్కువ.. ఏపీ చరిత్రలోనే అత్యంత చిత్తుగా ఓడిపోయాడు ఈ పెద్దమనిషి. జగన్ ధాటికి టీడీపీ కకావికలమైంది.ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు..

    సాధారణంగా దేవుళ్లను పెద్దగా నమ్మని.. నాస్తికుడు అని పేరున్న చంద్రబాబుకు అధికారం పోగానే అన్ని నమ్మకాలు వచ్చి పడుతున్నాయి. కొంచెం దైవభక్తి కూడా పెరిగిపోయింది.ఈ మధ్యన చంద్రబాబు చాలా డిఫెరెంట్ గా కనిపిస్తున్నాడు. ఎడమ చేతి చూపుడు వేలుకు ఒక ప్రత్యేక ‘ఉంగరం’ పెట్టుకొని కనిపిస్తున్నాడు. ఎడమ చేతి చూపుడు వేలుకు ఈ రింగ్ తొడిగి ఉంది.

    దేవుళ్లను , జాతకాలను నమ్మని పెద్దమనిషికి సడెన్ గా దైవభక్తి పెరిగిపోయిందా? జాతకాలు నమ్మేస్తున్నాడా? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఇలాంటి రింగ్ పెట్టుకుంటే కింగ్ అవుతాడని.. అధికారం ప్రాప్తిస్తుందని ఎవరో సాములోరు చెప్పారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

    చంద్రబాబు బామ్మర్ధి బాలయ్యకు అసలే నమ్మకాలు ఎక్కువ. ఆయన ఒంటిపై.. చేతి వేళ్లపై బోలెడన్నీ రింగులు, తాయత్తులు, మంత్రించిన దారాలు ఎన్నో కనిపిస్తుంటాయి. కొంపదీసి బామ్మర్ధి బాటలో బాబు నడుస్తున్నాడా? అన్న ప్రచారాలు సాగుతున్నాయి.

    ఇన్నీ ప్రచారాలు హోరెత్తుతుంటే వైసీపీ బ్యాచ్.. బాబుకు భయం పట్టుకుందని ఇక అధికారంలోకి రాడని తెలిసి చేతులకు రింగులు తొడుక్కుంటున్నాడని ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. ఈ రింగులో కథకు తెరదించాలని ఫైన్ ఈవినింగ్ డిసైడ్ అయిన చంద్రబాబు మొత్తానికి ఆ సీక్రెట్ రివీల్ చేశాడు.

    ఇదో ‘ఫిట్ నెస్’ రింగ్ అంట.. అందులో చిప్ ఉంటుందట.. అతి తన ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తూ ఉంటుందట.. తెల్లవారిన తర్వాత డేటా చూసుకొని తేడాగా ఉంటే కరెక్ట్ చేసుకుంటారట బాబుగారు.

    చంద్రబాబు వారసుడు లోకేష్ తో ఇక పని కాదని అర్థమైనట్టుంది. వారసత్వాన్ని లోకేష్ నిలబెట్టలేదని.. మరికొన్నేళ్లు తానే పగ్గాలు చేపట్టాల్సి ఉంటుందని బాబులో భయం పట్టుకుంటున్నట్టుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధతో ఈ టెక్నాలజీ బాబు అత్యాధునిక రింగ్ ను తెచ్చుకున్నాడు. ఎంతైనా ముందుచూపులో బాబును మించిన వారు లేరని సెటైర్లు వేస్తున్నారు.