Pawan Kalyan Formers : జన సేనాని పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ యుంది. ఆంధ్రాలోని యువతలో సగం మంది వచే‍్చసారి పవన్ ఏపీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఎక్కడ సభలు పెట్టినా సీఎం.. సీఎం అంటూ నినదిస్తున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి యువత జనసేనకు అండగా ఉంటోంది. అయితే అన్నివర్గాల మద్దతు కూడగట్టేందుకు పవన్ కళ్యాణ్ ఏడాదిగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. దీంతో ఆయా వర్గాలు కూడా జనసేనకు దగ్గరవుతున్నాయి. పవన్‌ను సీఎంగా చూడాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే.. సీఎం పదవి కావాలని ఎవరినీ అడగనని పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చేసిన ప్రకటన ఆయా వర్గాలను నిరాశకు గురిచేసింది.
పండించిన ధాన్యం అమ్ముకొడానికి లేదు, అమ్ముకుంటే గిట్టుబాటు ధర లేదు, ఇంకెలా వ్యవసాయం చేయాలి – కడియం రైతు ఆవేదన#JSPWithAPFarmers pic.twitter.com/JjebxS7eN9
— JanaSena Party (@JanaSenaParty) May 11, 2023
పవన్ ప్రకటనపై రైతుల ఆవేదన..
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించారు. రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ‘మీరు వస్తున్నారనే ధాన్యం కొనుగోలును వేగవంతం చేశారని’ పవన్ కళ్యాణ్‌కు పలువురు రైతులు తెలిపారు. మొత్తంగా పవన్ పర్యటనతో రైతులకు ఒక భరోసా కలిగింది. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ రైతులకు భరోసా ఇచ్చారు. అయితే మరుసటి రోజే మంగళగిరిలోని పార్టీ కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తాను సీఎం రేసులో లేనని ప్రకటించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మేము చెప్పినప్పుడు స్పందించి ధాన్యం కొని ఉంటే మాకు నష్టం జరిగేది కాదు – కడియం రైతు ఆవేదన#JSPWithAPFarmers pic.twitter.com/pK4A2EpgB6
— JanaSena Party (@JanaSenaParty) May 11, 2023
జనసేనకే కౌలు రైతుల మద్దతు..
ప్రస్తుత పరిస్థితుల్లో కౌలు రైతులు కూడా జనసేనకే మద్దతు తెలుపుతున్నారు. ఈ ఏడాది ఏపీలో పలువురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలను జనసేనాని పరామర్శించారు. ఆర్థికసాయం అందించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. కౌలు రైతులు ధైర్యంగా ఉండాలని, ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.
తొలకరి ధాన్యం అమ్మిన డబ్బు మొన్నీమధ్య వేశారు. మా ధాన్యం సొమ్ము తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు – కడియం రైతు ఆవేదన#JSPWithAPFarmers pic.twitter.com/67oP0iBfnB
— JanaSena Party (@JanaSenaParty) May 11, 2023
పవన్ వస్తున్నాడంటేనే అధికారుల్లో వణుకు..
ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకు పవన్ ఏపీలో ఏదైనా జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలియగానే అధికారులు అప్రమత్తం అవుతున్నారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. ఎలాంటి లోపం కనిపించకుండా చేస్తున్నారు. పవన్ ఎలాంటి పదవిలో లేకుండా పర్యటిస్తేనే అధికారులు ఇలా పనిచేస్తుంటే సీఎం అయితే తమకు మరింత మేలు జరుగుతుందన్న భావన అటు రైతులు, ఇటు కౌలు రైతుల్లో నెలకొంది. దీంతో ఏపీలో వ్యవసాయంపై ఆధారపడిన ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో పవనే సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల రాజమండ్రి పర్యటన సందర్భంగా పవన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు కూడా ఇదే విషయాన్ని జనసేనాని దృష్టికి తీసుకెళ్లారు. ‘మీరు ఏం చేయకపోయినా పరవా లేదు.. ముఖ్యమంత్రి అయితే చాలు’ అని పేర్కొనడం గమనార్హం.
అంటే పవన్ సీఎం కుర్చీలో కూర్చుంటే.. అధికారులు పనులు చేస్తారని, చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్న ధీమా ఏపీలోని రైతుల్లో వ్యక్తమవుతోంది.