జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.. దాదాపు నెల రోజులుగా ఆయన తన ఫామ్ హౌస్ లో కరోనాకు చికిత్స తీసుకుంటున్నాడు. ఐతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
తాజాగా అందరికీ పవన్ గుడ్ న్యూస్ తెలిపారు. పవన్ కల్యాన్ కరోనా నుంచి కోలుకున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా తెలిపింది.
మూడు రోజుల క్రితం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో పవన్ కు నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం పవన్ బాగానే ఉన్నారని.. కాకపోతే కాస్త నీరసంగా ఉన్నారని జనసేన తెలిపింది.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం.. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా పవన్ కరోనా బారినపడ్డారు. తొలుత ఆయన సెక్యూరిటీ సిబ్బందికి వైరస్ సోకింది. తర్వాత పవన్ కు కూడా పాజిటివ్ వచ్చింది.