https://oktelugu.com/

5 Assembly Elections: 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ పన్నిన వ్యూహం ఇదే..

5 Assembly Elections:  కరోనాను కాదని ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల పోలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వర్చువల్ ప్రచారం చేసుకుంటూ ఎన్నికలను నిర్వహించుకోవాలని చెబుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కదం తొక్కేందుకు సిద్ధవుతున్నాయి. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకు ఈ రాష్ట్రాల్లోని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై వీటి ఫలితాల ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ప్రతీ పార్టీకి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2022 / 09:30 AM IST
    Follow us on

    5 Assembly Elections:  కరోనాను కాదని ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల పోలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వర్చువల్ ప్రచారం చేసుకుంటూ ఎన్నికలను నిర్వహించుకోవాలని చెబుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కదం తొక్కేందుకు సిద్ధవుతున్నాయి. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకు ఈ రాష్ట్రాల్లోని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై వీటి ఫలితాల ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ప్రతీ పార్టీకి ఈ ఎన్నికలు సవాల్ గానే నిలవనున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ మరోసారి పాగా వేసేందుకు ప్లాన్ వేస్తోంది. అటు మిగతా మూడింటిని కైవలం చేసుకునేందుకు వ్యూహం పన్నుతోంది.

    5 Assembly Elections:

    ఈనెల 8న 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత చాలా మంది వీటి గురించే చర్చ పెడుతున్నారు. పంజాబ్ లో ఎవరొస్తారు..? యూపీ మళ్లీ బీజేపీకి వెళ్తుందా..? గోవాను ఈసారైనా కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందా..? ఢిల్లీ రికార్డులతో మరోసారి ఆప్ ఖాతాలో పడుతుందా..? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే మొత్తంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ స్టాండెట్ గా ఉండడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 18 కోట్ల సభ్యత్వం కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. మరోవైపు చాలా రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే బలపడుతోంది.

    Also Read:  విరాట్ కోహ్లీని చూసి ఫ్యాన్స్ షాక్.. ఆ వీడియోలో ఏముంది?

    బీజేపీ హిస్టరీని పరిశీలిస్తే పార్టీని ప్రేమించేవారికంటే పార్టీని నడిపించే నాయకులతోనే సక్సెస్ అవుతుందని తెలుస్తోంది. 2004 కు ముందు వాజ్ పేయి సారథ్యంలో సాగిన కమలం పార్టీ రెండేళ్లు పూర్తికాగానే దానిని దించేశారు. ఆ సమయంలో వాజ్ పేయి మాత్రమే బలమైన నాయకుడని ఎక్కువగా నమ్మారని తెలుస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు బీజేపీని ఓడించసాగాయి. కానీ ఇప్పడు మోదీ, షాల నాయకత్వంతో కొత్త శక్తి వస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడూ జేపీ నడ్డా కూడా తోడవ్వడం అదనపు బలంగా చెప్పుకుంటున్నారు.

    ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేరుగా కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడం..తమపై వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టడం కమలం అభివృద్ధికి దోహదపడుతోంది.18 కోట్ల సభ్యత్వం కలిగిన బీజేపీ ప్రతీ సభ్యుడిని గ్రౌండ్ లెవల్లో యాక్టివ్ చేసేలా నాయకత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. వారి అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణంగా పదవులనుకేటాయించి బూత్ లెవల్లో యాక్టివ్ గా ఉండేలా చూస్తుంది. బీజేపీమండల స్థాయి నాయకత్వానికిసైతం శిక్షణలు నిర్వహించి పార్టీ గురించి చెబుతూ ఉంటారు.

    ఇక సోషల్ మీడియా బీజేపీకి ఉన్న ప్లస్ పాయింట్. యూత్ నుఎక్కువగా ఆకర్షిస్తూ వారిని పార్టీలోకి చేర్చుకొని వారికి సరైన పదవులను కేటాయిస్తోంది. వీరి ద్వారా పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతారు. కమలం పార్టీకిదాదాపు 8 వేల మంది సమన్వయ కార్యర్తలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం తమ శాయశక్తులను ప్రదర్శిస్తారు. గతంలో బీజేపీ పోలింగ్ బూత్ స్థాయికి ఒక అధికారిని నియమించేది. వారి ద్వారా ప్రతీ ఓటరును కలిసి పార్టీ విధానాలను తెలిపేది.

    ఉత్తరప్రదేశ్ లో తాజాగా 800 మంది విస్తారక్ లను నియమించింది. ఉత్తరాఖండ్లో 120 మందిని, గోవా, పంజాబ్ లకు పదేసి మంది విస్తారక్ లను నియమించింది. పోలింగ్ బూతుల వారీగా ఓటర్ల జాబితాను తీసుకొని ప్రతీ పేజీకి ఒకరు ఇన్ చార్జులుగా వ్యవహరించేలా కార్యాచరణను అమలు చేస్తోంది. వీరిని పన్నా ప్రముఖ్ అని పిలుస్తారు. ఓటరు జాబితాలో ఒక్కో పేజీలో 30 వరకు ఓటర్లు ఉంటారు. పన్నా ప్రముఖ ఈ 30 మంది ఓట్లు పడేలా కృషి చేస్తారు.

    Also Read:  ‘హీరో’లో కృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!