https://oktelugu.com/

KCR: కేసీఆర్ ఆవేదన.. ఆగ్రహం ఇదే!

KCR: తెలంగాణలో బలంగా మారిన ప్రతిపక్షాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఓ రకమైన ఆవేదన, ఆగ్రహం పెల్లుబుకుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిని నియంత్రించడం సాధ్యం కాక తాజాగా విజ్ఞప్తులు మొదలుపెట్టడం ఆశ్చర్యకరంగా మారింది. ప్రతిపక్షాలను తుత్తునియలు చేసేలా రాజకీయం చేసే కేసీఆర్ ఇలా ప్రతిపక్షాలను వేడుకోవడం నిజంగానే షాకింగ్ గా మారింది. కేసీఆర్ ఎందుకిలా వెనక్కి తగ్గాడు? అసలు ఏంటీ కథ అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో దూసుకొస్తున్న ప్రతిపక్షాల విషయంలో కేసీఆర్ యూటర్న్ […]

Written By: , Updated On : October 9, 2021 / 09:16 AM IST
Follow us on

KCR: తెలంగాణలో బలంగా మారిన ప్రతిపక్షాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఓ రకమైన ఆవేదన, ఆగ్రహం పెల్లుబుకుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిని నియంత్రించడం సాధ్యం కాక తాజాగా విజ్ఞప్తులు మొదలుపెట్టడం ఆశ్చర్యకరంగా మారింది. ప్రతిపక్షాలను తుత్తునియలు చేసేలా రాజకీయం చేసే కేసీఆర్ ఇలా ప్రతిపక్షాలను వేడుకోవడం నిజంగానే షాకింగ్ గా మారింది. కేసీఆర్ ఎందుకిలా వెనక్కి తగ్గాడు? అసలు ఏంటీ కథ అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో దూసుకొస్తున్న ప్రతిపక్షాల విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకుంటున్నారా? అన్న చర్చ కూడా సాగుతోంది. తాజాగా రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని తిట్టవద్దన్న కేసీఆర్ కోరిక హాట్ టాపిక్ గా మారింది.

CM KCR

ప్రతిపక్షాలు రాజకీయాలు మాట్లాడండి.. ప్రభుత్వం చేసిన తప్పులను విమర్శించండి.. స్వేచ్ఛగా ప్రశ్నించండి.. కానీ రాష్ట్రాన్ని కించపరచడం మానుకోవాలని కేసీఆర్ రాష్ట్ర శాసనసభలో కోరడం చర్చనీయాంశమైంది.

ప్రతిపక్షాలు కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ప్రధానంగా ఆయన వ్యక్తిగత విమర్శలతోపాటు తెలంగాణలోని పలు స్కాంలు, ఇతర వాటిపై పడి జాతీయంగా ఈ రాష్ట్రం ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్న ఆవేదన కేసీఆర్ లో ఉంది. అందుకే అలాంటివి చేయకండని.. తిడితే నన్ను తిట్టండని కేసీఆర్ వేడుకోవడం విశేషం.

గత ఏడేళ్లలో తెలంగాణలో విద్యుత్, తాగునీరు, నీటిపారుదల సౌకర్యాల కొరతతో సహా అనేక సమస్యలను అధిగమించడమే కాకుండా దేశ జీడీపీలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చే కంటే కూడా ఎక్కువే కేంద్రానికి ఇస్తోంది. ప్రస్తుతం దేశంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలు. దేశంలో సగటు తలసరి ఆదాయం కంటే ఇది రెట్టింపు.

ఉమ్మడి ఏపీలో వ్యవసాయంపై కనీసం అవగాహన లేని వారిగా తెలంగాణ ప్రజలను ఎగతాళి చేశారు. కానీ నేడు అదే తెలంగాణ ఏకంగా దేశంలోనే 52శాతం వరిధాన్యం పండించి గత ఏడాది సత్తా చాటింది. దేశానికే అన్నపూర్ణగా మారింది. ఏపీ సగటు తలసరి ఆదాయం 1.70 లక్షల కంటే కూడా ఎక్కువే ఉంది.

గతంలో కంటే తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న వారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచే తెలంగాణకు వలస వస్తున్నారు. మహబూబ్ నగర్ లో వలసలు బాగా తగ్గాయి. ఇక్కడికి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం.. బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్న ప్రతిపక్షాలను కేసీఆర్ టార్గెట్ చేశారు. తెలంగాణను తిట్టకండని వేడుకుంటున్నారు. అలా తిడితే చేసిన అభివృద్ధి అంతా కొట్టుకుపోతోందన్న ఆవేదన కేసీఆర్ లో ఉంది.