China Jackal: చురకత్తిలాంటి చూపు.. గంభీరమైన నడక.. మెరుపు వేగం.. దిక్కులు పిక్కటిల్లెలా గాండ్రింపు.. 1000 సుత్తి దెబ్బలకు సమానమైన పంజా.. ఇలా చెప్పుకుంటూ పోతే పులి గుణగణాలు ఉపమానాలకు అందవు. క్రూరమైంది, తెలివైనది కాబట్టే పులి అడవికి రాజు అయింది. అంతటి బలశాలి అయిన పులి కంటే బలమైన జంతువు ఈ భూమ్మీద ఉందా? దానికంటే క్రూరంగా ఆలోచించగలదా? దానికి మించి పన్నాగాలు పన్న గలదా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు. తమ వద్ద పెరుగుతున్న నక్క పులికంటే బలమైందని చెప్తున్నారు. ఇంతకీ ఆ నక్క సంగతి ఏంటో మనం కూడా తెలుసుకుందామా.
యునాన్ ప్రావిన్స్ లో ఉంది
అనగనగా యునాన్ ప్రావిన్స్. చైనా దక్షిణ మార్గంలో ఉంటుంది. వెచ్చని తేమతో కూడిన వాతావరణం.. అందుకే కాబోలు ఇక్కడ జీవవైవిధ్యం ఎక్కువ. యునాన్ ప్రావిన్స్ వాయవ్య ప్రాంతంలో నుజియాంగ్ నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న గౌలిగాంగ్ మౌంటేన్ నేషనల్ నేచర్ రిజర్వ్ లో 582 జాతుల జంతువులు ఉన్నాయి. వీటిలో 20 మొదటి స్థాయి రక్షిత, మరో 47 రెండవ స్థాయి రక్షిత, ఇతర జాతులకు చెందిన జీవులు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటిల్లో అన్నింటికన్నా ప్రత్యేకం జాకిల్ లేదా మన పరిభాషలో చెప్పాలంటే నక్క. ఈ నక్క ప్రస్తావన చైనా ప్రాచీన జానపద కథల్లో ఎక్కువగా ఉంటుంది.
Also Read: Teachers- YCP Govt: ఏపీలో ఉపాధ్యాయుల సెల్ డౌన్.. వైసీపీ సర్కారుకు షాక్
వేటాడి తినటంలో, ఆహారాన్ని సంపాదించుకోవడంలో ఈ నక్కలాగా వ్యవహరించాలని చైనా పూర్వికులు చెప్పేవారు. వాస్తవానికి ఇది చాలా మర్మమైన జంతువు. పైగా ఇది చైనా లోని యూనాన్ లో తప్ప ఎక్కడా జీవించదు. దీని శైలి తెలుసు కనుక చైనీయులు తమ ప్రకటించిన “ఫోర్ బీస్ట్” యానిమల్స్ లో ఈ నక్కకు మొదటి స్థానం కల్పించారు. ఆ తర్వాతి స్థానాలు తోడేళ్లు, పులులు, చిరుత పులులకు ఇచ్చారు. ఈ నక్కలు దురాశ, క్రూరత్వానికి చిహ్నంగా ఉంటాయి. ఇవి పొద్దంతా ఆహార అన్వేషణ సాగించి.. రాత్రికి గౌలిగాంగ్ రిజర్వులో విశ్రాంతి తీసుకుంటాయి. అవి విశ్రాంతి తీసుకునే సమయంలోనూ శత్రువులను ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. ఏమాత్రం ఆపద వచ్చినా మూకుమ్మడిగా దాడి చేస్తాయి. తమ పదునైన పళ్ళతో ఎక్కడికక్కడ చీల్చి పడేస్తాయి. ఇవి పెద్ద పెద్ద సమూహాలుగా జీవిస్తాయి.
వీటి రూపం చాలా ప్రత్యేకం
ఇటీవల ఈ జాతుల గురించి యునాన్ ఫీల్డ్ ఇన్ ఫ్రారెడ్ సిబ్బంది అధ్యయనం చేశారు. వీటి సమూహాలు పెద్దవిగా ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఇవి మన గలగలేవని చెప్పారు. భౌగోళికంగా ఏమాత్రం అపసవ్య పరిస్థితులు ఏర్పడినా ఇవి తట్టుకోలేవని స్పష్టం చేశారు. ఈ నక్కలు కూడా ఒక జాతి కుక్కల్లాగానే కనిపిస్తాయి. వీటి డీఎన్ఏ పరిణామ క్రమాన్ని పరిశీలించినప్పుడు ఇవి ఆసియా ప్రాంతం నుంచి ఉద్భవించినట్టు తెలిసింది. మరోవైపు ఇవి చూసేందుకు తోడేళ్లు, కుక్కల మాదిరి కనిపిస్తాయి. పొట్టిగా ఇరుకైన మూతితో ఉంటాయి. ఇవి తోడేళ్లు, కుక్కల కంటే చాలా చాకచక్యంగా వ్యవహరిస్తాయి. ప్రపంచంలో ఈ నక్కలకు సంబంధించి 11 ఉప జాతులు, చైనా సరిహద్దుల్లో ఐదు జాతులు నివసిస్తున్నాయి. పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉండే నక్కలు, తూర్పు ఆసియా ప్రాంతంలో ఉండే నక్కలు, కాశ్మీర్ ప్రాంతంలో జీవించే నక్కలకు, వీతికి మధ్య కొంతమేర వైవిధ్యం ఉంటుంది. కానీ ఆహార అన్వేషణలో చైనా నక్కలకు ఏవీ సాటి రావు. చైనా ఆర్మీలో చేరే కొత్త అభ్యర్థులకు శిక్షణలో ఈ నక్కలకు సంబంధించిన పాఠాలు అక్కడి అధికారులు చెబుతారు. ఎందుకంటే శత్రువులు చుట్టుముట్టినప్పుడు వాటిని ఈ నక్కలు ఎదుర్కొనే తీరు ఒక సినిమా లాగా ఉంటుంది. అయితే చైనాలోని అన్ని భౌగోళిక పరిస్థితులను తట్టుకొని జీవించే లాగా ఈ నక్కల పైన అక్కడి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి గనుక విజయవంతం అయితే ఈ భూమి మీద పులి కంటే బలమైన జంతువు చైనా నక్కే అవుతుంది.
Also Read:FIFA Announces Suspension Of AIFF: భారత ఫుట్ బాల్ సంఘంపై నిషేధం.. ఎందుకీ పరిస్థితి? అసలు కారణాలేంటి?