Third Wave Effect: థర్డ్ వేవ్ ఎఫెక్ట్: సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం

Third Wave Effect: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో లక్షల్లో నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. దేశవ్యాప్తంగా కేసులు ఇలా పెరడంతో కొన్ని స్టేట్లు నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ర్ట, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వారాంతపు లాక్ డౌన్లు అమలు చేస్తున్నారు. గడచిన 24 గంటల్లో 2.45 లక్షల కేసులు నమోదయ్యాయంటే వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ […]

Written By: Srinivas, Updated On : January 13, 2022 10:33 am

Modi

Follow us on

Third Wave Effect: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో లక్షల్లో నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. దేశవ్యాప్తంగా కేసులు ఇలా పెరడంతో కొన్ని స్టేట్లు నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ర్ట, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వారాంతపు లాక్ డౌన్లు అమలు చేస్తున్నారు. గడచిన 24 గంటల్లో 2.45 లక్షల కేసులు నమోదయ్యాయంటే వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు స్టేట్లతో గురువారం సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో తీసుకోబోయే నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Third Wave Effect:

కరోనా నియంత్రణకు తీసుకోబోయే చర్యల గురించి ప్రధాని చర్చించనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తీసుకోబోయే నియంత్రణ చర్యల గురించి వివరించనున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సినేషన్ వేగవంతంపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం కరోనా రక్కసిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నా అవి ప్రయోజనం కలిగించడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది.

Also Read: సంక్రాంతి పండుగ 14న కాదు.. పండితులు ఏం చెప్తున్నారంటే?

కేంద్ర ఆరోగ్య శాఖ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. వేగంగా విస్తరిస్తోందని చెబుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అరవై ఏళ్లు పైబడిన వారికి ప్రకాషన్ డోసు ఇప్పించాలని చెబుతోంది. ముఖ్యమంత్రులతో సమావేశం తరువాత కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలని భావిస్తోంది.

సంక్రాంతి పండుగ వేళ వేరియంట్ మరింత విస్తరించవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో పండుగ నిర్వహణపై కూడా ఆంక్షలు విధించనున్నారు. మనకు కలిసొచ్చే అంశం ఏమిటంటే ఈసారి మరణాల రేటు తక్కువగా ఉండటం. దీంతో కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతున్నా ప్రజల్లో ఆందోళన మాత్రం కనిపించడం లేదు. కరోనా వ్యాప్తిపై ప్రధాని దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో కరోనా వేరియంట్ ప్రభావం తగ్గించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Also Read:  కూతురు బర్త్ డేలో కోహ్లీ ఏం చేశాడంటే?

Tags