తిరుపతిలో దొంగ ఓట్ల కోసం వైసీపీ నేతలు వేసిన స్కెచ్ లు బయటపడుతున్నాయి.. ఈ మేరకు సోషల్ మీడియాలో వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిట వైరల్ అవుతున్న ఒక ఆడియో లీక్ ను బట్టి తెలుస్తోంది. ఇవిప్పుడు షాకింగ్ గా మారాయి.
పోలింగ్ కు ముందురోజే జనాన్ని తరలించాలని ఆ ఆడియోలో ఎమ్మెల్యే చెవిరెడ్డి దిశానిర్ధేశం చేస్తున్నట్టు ఉంది. ఇక పోలింగ్ రోజే మరో వైసీపీ నేత ఆడియో కాల్ కూడా బయటపడడం సంచలనం రేపుతోంది.
పోలింగ్ సందర్భంగా ఇతర జిల్లాల నేతల నుంచి దొంగ ఓట్లు తరలించారని స్పష్టం అవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేతో ప్రజలను తరలించేందుకు బస్సులు, వాహనాల ఏర్పాటు చేయాలని మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది.
ప్రజలను తరలించేందుకు 7 బస్సులు కాదని.. 12 బస్సులు కావాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆడియోలో మాట్లాడారు. ఒకరోజు ముందే దీనిపై ప్లాన్ చేయాలని సూచించారు. అదే రోజు వాళ్లను రెడీ చేయవద్దని.. ముందురోజు వాళ్లను రెడీ చేయాలని సూచించారు.
ఇక దొంగ ఓటర్లు వస్తే బస్సులు ఇక్కడి వారు అడ్డుకుంటారని చెవిరెడ్డి అన్నారు. అందుకే ఇదంతా పక్కా ప్లానింగ్ తో జరిగిందని అర్థమవుతోంది. కాబట్టి ఇక్కడి వారితోనే మనం ఓట్లువేయిద్దామని ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్నట్టు ఆడియోలో స్పష్టమవుతోంది. దీన్ని బట్టి దొంగ ఓటర్లు తిరుపతికి వచ్చినట్టు తెలుస్తోంది.