https://oktelugu.com/

ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని ఖాయమేనా?

మార్చి నెలాఖరుతో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ముగియనుంది. జగన్ సర్కార్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన నిమ్మగడ్డ ఎట్టకేలకు పరిషత్ ఎన్నికలను నిర్వహించకుండానే దిగిపోతున్నారు. ఈ క్రమంలోనే కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు నీలం సాహ్ని, ప్రేమ్ చంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 23, 2021 / 03:55 PM IST
    Follow us on

    మార్చి నెలాఖరుతో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ముగియనుంది. జగన్ సర్కార్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన నిమ్మగడ్డ ఎట్టకేలకు పరిషత్ ఎన్నికలను నిర్వహించకుండానే దిగిపోతున్నారు.

    ఈ క్రమంలోనే కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు నీలం సాహ్ని, ప్రేమ్ చంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిసింది.

    ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన అధికారులుగా నీలం సాహ్ని, శామ్యూల్ లు ఉన్నారు. శామ్యూల్ రిటైర్ అయ్యాక జగన్ కీలక పదవి ఇచ్చారు. నవరత్నాల ప్రత్యేక అధికారిగా ఆయనను నియమించారు. జగన్ సలహాదారుగా చేశారు.

    ఇక ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్ని జగన్ కు వెన్నుదన్నుగా నిలిచి గత డిసెంబర్లోనే రిటైర్ అయిపోయారు. రెండు సార్లు ఆమె పదవీకాలాన్ని జగన్ పొడిగించారు. ప్రస్తుతం సీఎం సలహాదారుగా ఆమెకు కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చారు. నీలం సాహ్నికి పలు కీలక బాధ్యతలను జగన్ అప్పగించారు.

    నిమ్మగడ్డ తీరు చూశాక చాలా నమ్మకమైన వ్యక్తులనే ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియమించాలని జగన్ యోచిస్తున్నారు. అందుకే సన్నిహితులైన వారినే ఎంపిక చేశారు. ఇందులో నీలంసాహ్నికి దాదాపుగా ఏపీ ఎస్ ఈసీ పదవి ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది..