
దేశాన్ని కరోనా ఆవహించింది. సెకండ్ వేవ్ తో ప్రాణాలు తీస్తోంది. ఆక్సిజన్, మందుల కొరతతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. నిజానికి కరోనా అందరికీ సోకినా చాలామంది యువతకు రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల అది బయటపడడం లేదు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఇప్పుడు పాజిటివ్ స్టేజిలో ఉన్నారు. మీ దేహంలో ఉన్న “వ్యాధి నిరోధక శక్తి” ప్రస్తుతం వైరస్ తో పోరాడుతూనే ఉంది. అందుకే చాలా మందికి బయటపడడం లేదు. బయటపడిన వారు సీరియస్ అవుతున్నారు. అవయవాలపై దెబ్బ పడుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా ప్రబలిన ఈ సమయంలో అసలు పరీక్షలు, చికిత్సలు కూడా చేసే పరిస్థితి లేదు. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. వైరస్ సోకినా కూడా మీరు కరోనా టెస్ట్ లు చేయించుకోవడం ఇపుడు వీలుకాదు. అందరికీ టెస్ట్ లు చేసే అవకాశం లేదు.
ఇక ఇప్పుడు కరోనా మందులకు రెక్కలు వచ్చాయి. అన్నీ బ్లాక్ మార్కెట్ కు తరలిపోయాయి. అతి ఖరీదైన కరోనా మందులు కొనటం ఈ సమయంలో అత్యంత కష్టంగా మారింది. ఒకవేళ కొనాలన్నా అవి అందుబాటులో లేవు.
కాబట్టి ప్రజలంతా కూడా ఇప్పుడు దృష్టి సారించాల్సింది మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీలో ఉన్న వ్యాధినిరోధకశక్తికి మీరు సపోర్టు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరోనాపై రహస్య సర్వేలో తేల్చిన సంచలన నిజాలు కొన్ని బయటకు వచ్చాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఇలా ఉంది.
* ఇవి రోజూ వాడితే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
1. రోజూ ఒక నిమ్మకాయ రసం,
2. జింక్ (Tab. Zincovit)
3.Vitamin D3 (ఉదయం 7నుంచి 8 గంటల మధ్య ఎండలో అర్ధ గంట ఉంటే సహజసిద్దంగా వస్తుంది).
4.వేడి నీరు ఉదయం/ సాయంత్రం
5.మంచి ఆహారం తినాలి. ఆకుకూరలు, గుడ్లు, చికెన్,మటన్.. ఫ్రై లకి దూరంగా ఉండండి ఓన్లీ కర్రీ
6. కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగండి.
ఇవి పాటించి మిమ్మల్ని మీరే రక్షించుకోండి, ఎవరూ.. ఏ మందులూ మిమ్మలని కాపాడలేవు. మన ఆరోగ్యమే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఇప్పటికే అందరూ పాజిటివ్ గా మారారు. గుర్తుంచుకోండి. మీ భవిషత్తు.. మీ అనుకునే వాళ్ళ భవిషత్తు మీ చేతుల్లోనే వుంది జాగ్రత్త. ముఖ్యంగా మాస్కులు ధరించండి. మీ మీద ఆధారపడ్డ జీవితాలు చాలా మంది ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తే మనుగడ.