https://oktelugu.com/

Repeal of Agricultural Laws: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఇంత స్టోరీ ఉందా..?

Repeal of Agricultural Laws: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ నిన్న ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాల రద్దుకు ఆమోదం పొందేలా ప్రయత్నిస్తామన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. కానీ ఇన్ని రోజుల నుంచి రైతుల గురించి ఆలోచించని మోదీ ఇప్పుడే చట్టాల రద్దు నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో రాజకీయ విశ్లేషకులకు ఇప్పటికే అర్థమైంది. త్వరలో జరిగే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2021 / 09:45 AM IST
    Follow us on

    Repeal of Agricultural Laws: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ నిన్న ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాల రద్దుకు ఆమోదం పొందేలా ప్రయత్నిస్తామన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. కానీ ఇన్ని రోజుల నుంచి రైతుల గురించి ఆలోచించని మోదీ ఇప్పుడే చట్టాల రద్దు నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో రాజకీయ విశ్లేషకులకు ఇప్పటికే అర్థమైంది. త్వరలో జరిగే పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఎదురుదెబ్బ పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. అయితే మోదీ ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా రైతులు బీజేపీకి మద్దతు పలుకుతారా..? ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి..?

    Also Read: చరిత్రలో తొలిసారి.. మోడీ ‘సారీ’.. వైరల్

    modi-with-farmer-

    వచ్చే సంవత్సరంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అతిముఖ్యమైనవి. విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రంతో పాటు ఎక్కువ పార్లమెంట్ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక భారత్ కు సరిహద్దులో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోనూ పాగా వేసేందుకు మోదీ ఇప్పటి నుంచే వ్యూహం పన్నుతున్నట్లు చర్చ సాగుతోంది. పంజాబ్ లో సాధారణ రాజకీయ నాయకులతో పాటు ఖలిస్తాన్ గ్రూపులు చురుకుగా పనిచేస్తాయి. ఎన్నికల సమయంలో ఖలిస్తాన్ గ్రూపులను ఆయా పార్టీలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలో పంజాబ్ కు చెందిన రైతులే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ తో వ్యతిరేకంగా ఉండాలని మోదీ భావించడం లేదు.

    పంజాబ్ లోని అకాలీదల్, బీజేపీకి ఒకప్పుడు మంచి సంబంధాలుండేవి. ఈ రెండు పార్టీలు కలిసి చాలా సంవత్సరాలుగా కలిసున్నాయి. వ్యవసాయ చట్టాల నేపథ్యంలో అకాలీదళ్ బీజేపీకి దూరమైంది. గత సంవత్సరం ఎన్డీఏ కూటమి నుంచి తెగదెంపులు చేసుకొని వేరు పడింది. తాజాగా మోదీ వ్యవసాయ చట్టాలు రద్దు ప్రకటన తరువాత అందరికంటే ముందుగా తానే హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అమరిందర్ సింగ్ ప్రకటించారు. దీంతో బీజేపీ మళ్లీ అకాలీదళ్ తో కలిసిపోనుందా…? అన్న చర్చ సాగుతోంది. అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల రద్దుతో పంజాబ్ లో బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని, అకాలీదల్ లో పొత్తు ఉంటే కొంత రాజకీయ ప్రయోజనం ఉండేదని అంటున్నారు. కానీ అమరీందర్ సింగ్ మాత్రం అవసరమైతే బీజేపీతో కలిసే అవకాశాలున్నాయన్న సంకేతాలు పంపిస్తున్నారు.

    ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా ప్రాంతాల వారీగా బీజేపీ ఇన్ చార్జులను నియమించింది. ఇక్కడ ఇన్ చార్జుల నియమించిన తరువాత రోజే మోదీ వ్యవసయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని భట్టి చూస్తే యూపీ ఎన్నికలు బీజేపీకి ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చని కొందరు అంటున్నారు. ఇప్పడు చేస్తున్న రైతు ఉద్యమాలు యూపీలోని అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని చెరుకు రైతుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది.

    ఈ రాష్ట్రంలో కులాల వారీగా ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ ముస్లింలు 32 శాతం, దళితులు 18 శాతం, జాట్ లు 12 శాతం, ఓబీసీలు 30 శాతం ఉన్నారు. వీరిలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వీటిలో ముస్లిం ఓటు బ్యాంకును పక్కన బెడితే మిగతా ఓట్లపై బీజేపీ దృష్టి సారించింది. దళితులను ఆకట్టుకునేందకు ఇప్పటికే పలు సదస్సులను నిర్వహిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఇటీవల దళితుల ఇళ్లల్లో పర్యటిస్తూ వస్తున్నారు. ఇక వ్యవసాయ చట్టాలతో ఆగ్రహంగా ఉన్న జాట్ లు మోదీ నిర్ణయంతో తిరిగి బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

    Also Read: సాగు చట్టాల రద్దు: మోడీ పంతం ఓడింది.. రైతే గెలిచాడు!