TRS: అర్జంటుగా కేసీఆర్ ను ఢిల్లీ పంపాలి.. కేటీఆర్ ను సీఎం చేయాలి.. అంతే!

TRS: ఎంత కాదనుకున్నా వాళ్లిద్దరూ తండ్రీ కొడుకులు.. పైగా తెలంగాణను పాలించే ముఖ్యమంత్రి, మంత్రి. ఎవరూ ఔనన్నా కాదన్నా కాబోయే ముఖ్యమంత్రి మన కేటీఆర్. అయితే కేసీఆర్ ఉండగా ఇప్పట్లో అది సాధ్యం కాదు.. పక్కకు తప్పించడం కష్టమే. మరి ఏం చేయాలి? అంటే అర్జంటుగా కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి పంపాలి. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా అదే తంతు జరిగింది.. రేవంత్ రెడ్డి అన్నట్టు కేసీఆర్ ఫ్యామిలీలో ఒత్తిడి ఉందో.. లేక నిజంగానే కేసీఆర్ జాతీయ […]

Written By: NARESH, Updated On : April 28, 2022 11:37 am
Follow us on

TRS: ఎంత కాదనుకున్నా వాళ్లిద్దరూ తండ్రీ కొడుకులు.. పైగా తెలంగాణను పాలించే ముఖ్యమంత్రి, మంత్రి. ఎవరూ ఔనన్నా కాదన్నా కాబోయే ముఖ్యమంత్రి మన కేటీఆర్. అయితే కేసీఆర్ ఉండగా ఇప్పట్లో అది సాధ్యం కాదు.. పక్కకు తప్పించడం కష్టమే. మరి ఏం చేయాలి? అంటే అర్జంటుగా కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి పంపాలి. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా అదే తంతు జరిగింది..

రేవంత్ రెడ్డి అన్నట్టు కేసీఆర్ ఫ్యామిలీలో ఒత్తిడి ఉందో.. లేక నిజంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆశనో ఏమో కానీ టీఆర్ఎస్ ప్లీనరీలో అర్జంటుగా కేసీఆర్ దేశ్ కీ నేత అయిపోవాలి.. జాతీయ రాజకీయాలను దున్నేయాలని అందరూ గొంతెత్తినవారే. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రకటనలు చేస్తున్నంత సేపు గులాబీ దండు అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది.

ఇక కేసీఆర్ ను దేశ రాజకీయాల్లోకి పంపాలన్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రసంగం సాగింది. ‘దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ అవసరం’ అని కేటీఆర్ అన్నారు. చరిత్రలో దశాబ్దాల కాలం నిలబడే పార్టీలు స్థాపించింది ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని కేటీఆర్ తన తండ్రి గురించి గొప్పగా పొగిడేశారు. అంతేకాదు.. భారతదేశానికి కేసీఆర్ లాంటి నేత కావాలని.. దేశ ప్రగతికి బంగారు బాట వేయాలని’ కేటీఆర్ అన్నారు.

Also Read: Virat Kohli: కోహ్లీ పని అయిపోయిందా? ఇక వైదొలగాల్సిందేనా?

కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోతే ఎలాగూ తెలంగాణకు తానే సీఎం అని కేటీఆర్ ఈ మాటలు అని ఉండొచ్చని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఎందుకంటే కేటీఆర్ మాత్రమేకాదు.. ఆ ప్రాంగణమంతా వెంటనే తెలంగాణ నుంచి కేసీఆర్ ఢిల్లీ పంపించేసి ప్రధానిని చేయాలని చూస్తున్నారు.కానీ అంతటి శక్తి సామర్థ్యాలు, పార్టీ బలం బలగం ఉందా? అని ఆలోచించడం లేదు. గులాబీ దండు అంటే అయిపోతుందన్నట్టు టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రసంగాలు సాగాయి.

కేసీఆర్ కూడా తెలంగాణను మార్చినట్టు ఇండియాను మార్చేస్తానన్నట్టుగా తన వ్యూహాలన్నీ వల్లెవేశారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు రావాలని బోధించాడు. చూస్తుంటే తెలంగాణ సీఎం కుర్చీలో కేసీఆర్ ఇంకా ఎంతో కాలం కూర్చోలేడని.. జాతీయ రాజకీయాల పేరుతో పక్కకు తప్పుకొని కేటీఆర్ కు కుర్చీ అందించేలానే కనిపిస్తున్నారు.ఇంట్లో ఒత్తిడినో లేక నిజంగానే కోరికనో కానీ ఇప్పుడు కేసీఆర్ దేశ్ కీ నేత వెనుక ఏదో మర్మం దాగి ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ కోరిక తీరుతుందా? కలగానే మిగిలిపోతుందా? అన్నది 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ తేలిపోతుంది. బీజేపీ ఓడిపోతేనే కేసీఆర్ లాంటి వాళ్లకు ఛాన్స్.. గెలిస్తే తెలంగాణకే కేసీఆర్ పరిమితం కాక తప్పదు.

Also Read: Best Cars in India: భారత కార్ల పరిశ్రమలో మరుపురాని పది పాపులర్ కార్లు ఇవీ