Homeజాతీయ వార్తలుIPS Officer Abhishek Mohanty: ఆ ఐపీఎస్ కు కేసీఆర్ ఎందుకు పోస్టింగ్ ఇవ్వడం లేదు.....

IPS Officer Abhishek Mohanty: ఆ ఐపీఎస్ కు కేసీఆర్ ఎందుకు పోస్టింగ్ ఇవ్వడం లేదు.. తెరవెనుక కథేంటి?

IPS Officer Abhishek Mohanty: ఏపీ నుంచి రిలీవ్ అయిన ఐసీపీ ఆఫీసర్ అభిషేక్ మహంతికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదు. ఆయనను విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరిస్తూ వస్తోంది. మొదట్లో ఏపీ, తెలంగాణ విభజన టైంలో ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. తనది తెలంగాణ అని తెలంగాణ క్యాడర్‌ కోసం క్యాట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. దీని కారణంగా ఏపీ ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది. తర్వాత ఇక్కడికి వచ్చిన ఆయనను తెలంగాణ ప్రభుత్వం చేర్చుకోవడం లేదు. ఫలితంగా ఆయన సుమారు 6 నెలలుగా ఖాళీగా ఉన్నారు.

IPS Officer Abhishek Mohanty:
IPS Officer Abhishek Mohanty:

తెలంగాణ ప్రభుత్వం తనను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆయన తాజాగా క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయనను విధుల్లోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వివిధ కారణాలు చెబుతుండటంతో తెలంగాణ సీఎస్‌పై సీరియస్ అయింది. వాస్తవానికి తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌ది ఏపీ క్యాడర్. కానీ ఆయన క్యాట్‌ ను ఆశ్రయించి తెలంగాణలో ఉండేలా ఆదేశాలు తీసుకొచ్చుకున్నారు.

Also Read:  మంత్రి గౌతంరెడ్డి ఫ్యామిలీ సంచలనం.. ప్రభుత్వానికి కోట్ల ఆస్తులు.. ఆయన పేరుతో యూనివర్సిటీ

కానీ ప్రస్తుతం అభిషేక్ మహంతి అదే పని చేస్తే ఆయనను విధుల్లో చేర్చుకోవడానికి ఒప్పుకోవడం లేదు. కానీ ఇక్కడి సీఎస్ కంటే ప్రభుత్వ పెద్దల అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. మరి అభిషేక్ మహంతి విషయంలో ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందో సివిల్ సర్వీస్ వర్గాలకు తెలియడం లేదు. అభిషేక్ మహంతి… మాజీ ఐపీఎస్ అధికారి ఏకే మహంతి కొడుకు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకు ఆయన కీలక బాధ్యతల్లో సేవలందించారు. అనంతరం గవర్నర్‌కు సలహాదారుగా పని చేశారు.

cs somesh kumar
cs somesh kumar

ఆయన ఇద్దరు కుమారులు కూడా ఐపీఎస్ అధికారులే. ఒకరు ఇప్పటికే తెలంగాణ క్యాడర్‌లో ఉన్నారు. అయితే మహంతి విషయంలో తెలంగాణ సీఎస్‌పై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసింది క్యాట్. మహంతి పట్ల ఎందుకు అలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. సీఎస్ తన తరపున కొన్ని కారణాలు చెప్పినా దానికి క్యాట్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. వారంలోపు మహంతికి పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ డెట్ లైన్ పెట్టడంతో అతనికి పోస్టింగ్ ఇచ్చే చాన్స్ ఉంది.

Also Read: బీజేపీతో ఇక తెగదెంపులేనా..? దూరంగా ఉంటున్న పవన్? కారణం నాగబాబేనా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular