BJP National Executive Meeting: భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. నిన్నటి నుంచి భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సమావేశాల ద్వారా ఓ సందేశం పంపాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలనే నినాదాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. రాజరిక రహిత పాలనే ధ్యేయంగా ముందుకు నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కుటుంబ పాలనతో కుదేలైపోవడంతో రాష్ట్రాల్లో ఆ ఆనవాళ్లు ఉన్నాయని సూచిస్తోంది. వాటిని కూడా పెకిలించి ప్రజాస్వామ్య భారత్ కోసం పరిశ్రమించాలని ఆశిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ మూడో సారి అధికారం కోసం పలు ప్రణాళికలు రచిస్తున్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా మూడోసారి కూడా అధికారం దక్కించుకుని ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని కసరత్తు ముమ్మరం చేశారు. హోం మంత్రి అమిత్ షా కూడా దీని కోసం పలు రకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. దీని కోసమే హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ పోకడలకు చెక్ పెట్టాలని చూస్తోంది. ఈ మేరకు బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Senior Heroine Malavika: ఫేడ్ అవుట్ హీరోయిన్ కి సడెన్ గా క్రేజ్.. కారణం ఆయనే !
రాజవంశ రహిత భారత్ కోసం బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనతోనే అధికారానికి దూరం కావడంతో రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలను సైతం కుటుంబ పాలను దూరం చేస్తేనే దేశం బాగుపడుతుందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కర్ణాట, మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ తెలంగాణపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీంతోనే తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి నేతల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు నిర్ణయించింది.

పద్దెనిమిదేళ్ల తరువాత తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడంతో ఇక్కడ తన ప్రభావాన్ని చూపించాలని తాపత్రయపడుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు పాదయాత్ర నిర్వహించి అధికార పార్టీని ఎండగట్టారు. నేతల్లో సమన్వయం సాధించి విజయం సాధించేందుకు కావాల్సిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ బీజేపీ పై మాటల యుద్ధం ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ రాక సందర్భంగా ఓ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసైనా దేశంలో ఇలాంటి వాటిని అమలు చేసేందుకే మోడీ వస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సంకుచిత మనస్తత్వాలు వీడి మంచితనం నేర్చుకునేందుకే వస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీపై పదునైన మాటలతో లేఖ రాసి బీజేపీని విమర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. మంత్రి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: Reliance : రిలయన్స్ కొత్త సైడ్ బిజినెస్.. బిట్రీష్ వాళ్ల రుచులు ఇక ఇండియాలో..