Sub Inspector Adventure : 16 మందిని కాపాడిన ఎస్సై.. సాహసానికి సెల్యూట్‌ చేయాల్సిందే!

Sub Inspector Adventure : పోలీస్‌ అనగానే.. ఎత్తయిన ఆహార్యం.. ఉగ్రహ రూపం.. కరుడుగట్టిన మనసు.. ఇదీ అందరి మనసులో మెదిలే రూపం. ఇక ఒకప్పుడు పోలీస్‌ అంటే చేసింగ్, కూంబింగ్, ఎన్‌కౌంటర్, లాఠీచార్జి ఇలా ఉండేవి. టెక్నాలజీ పెరిగిన తర్వాత, చట్టాల్లో ఆర్పులు వచ్చాక రన్నింగ్, ఛేసింగ్‌ లాంటివి తగ్గిపోయాయి. ఎవరిని పడితే వారిపై అకారణంగా చేయి చేసుకునే పరిస్థితి మారింది. దీంతో పోలీసుల కూడా చాలా వరకు శారీక శ్రమ తగ్గింది. దీంతో ఆహార్యంలో […]

Written By: NARESH, Updated On : March 22, 2023 12:11 pm
Follow us on

Sub Inspector Adventure : పోలీస్‌ అనగానే.. ఎత్తయిన ఆహార్యం.. ఉగ్రహ రూపం.. కరుడుగట్టిన మనసు.. ఇదీ అందరి మనసులో మెదిలే రూపం. ఇక ఒకప్పుడు పోలీస్‌ అంటే చేసింగ్, కూంబింగ్, ఎన్‌కౌంటర్, లాఠీచార్జి ఇలా ఉండేవి. టెక్నాలజీ పెరిగిన తర్వాత, చట్టాల్లో ఆర్పులు వచ్చాక రన్నింగ్, ఛేసింగ్‌ లాంటివి తగ్గిపోయాయి. ఎవరిని పడితే వారిపై అకారణంగా చేయి చేసుకునే పరిస్థితి మారింది. దీంతో పోలీసుల కూడా చాలా వరకు శారీక శ్రమ తగ్గింది. దీంతో ఆహార్యంలో మార్పులు కూడా వస్తున్నాయి. ధ్రుడమైన శరీరాలు కాస్త.. బొజ్జలతో కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పోలీసుల కాఠిన్యం వెనుక కారుణం కూడా ఉంటుంది. సందర్భోచితంగా అవి బయటపడుతుంటాయి. సాహసాలు కూడా చేసి ప్రాణాలు నిలబెట్టిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ ఎస్సై నడుస్తున్న వ్యాన్‌ నుంచి దూకి 16 మంది ప్రాణాలను కాపాడాడు.

వాహనంలో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులు..
టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా ఏబీవీపీ నాయకులు మంగళవారం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. స్పందించిన పోలీసులు చాలాసేపు శ్రమించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అందరినీ వ్యాన్‌లో ఎక్కించారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించే క్రమంలో వాహనం అదుపు తప్పింది. రోడ్డుపై పరుగులు తీస్తున్న వాహనాన్ని అపేందుకు బంజారాహిల్స్‌ ఎస్సై కరుణాకర్‌రెడ్డి సాహసం చేశారు. ప్రాణాలకు తెగించి వాహనం వెనుక నుంచి దూకి, దాని ముందుకు పరుగెత్తి నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. అందులో ప్రయాణిస్తున్న 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో..
16 మంది ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులతో వాహనం బంజారాహిల్స్‌ పోలస్‌ స్టేషన్‌కు బయల్దేరింది. బంజారాహిల్స్‌కు చెందిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది వ్యానులో కూర్చున్నారు. వాహనం ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ దిగి నెక్లెస్‌రోడ్డు వైపు వెళుతుండగా.. డ్రైవర్‌ రమేశ్‌కు ఫిట్స్‌ రావడంతో వాహనం అదుపు తప్పి అటూ ఇటూ తిరుగుతూ వెళ్లడాన్ని వెనుక ఉన్న ఎస్సై కరుణాకర్‌రెడ్డి గమనించారు. వెంటనే ఆయన నడుస్తున్న వాహనం నుంచి కిందకు దూకేశారు. అదే ఊపులో వ్యాను ముందుకు పరుగుతీశారు. డోర్‌ తీసి, స్టీరింగ్‌ పట్టుకోవడం, వెంటనే బ్రేక్‌ వేయడంతో అది ఒక్క కుదుపుతో పూలకుండీని ఢీకొట్టి పక్కన ఉన్న గ్రిల్స్‌ను తాకి ఆగిపోయింది. ఫ్లైఓవర్‌పై ఎడమ వైపు వెళ్లి ఉంటే వ్యాన్‌ కిందకు పడిపోయేది. కుడివైపు వెళ్తే వాహనాలను ఢీకొట్టేది. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పిందని వాహనదారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న సైఫాబాద్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వాహనాన్ని తొలగించి, అరెస్టు చేసిన వారిని మరో వాహనంలో తరలించారు. ఈ ఘటనలో ఎస్సైతోపాటు హోంగార్డు రమేష్, మరో కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స అందించారు.