Nirmal Koyya Bommalu: చూసొద్దాం రండి : చరిత్రలో నిలిచిన నిర్మల్‌ ‘కొయ్య బొమ్మల కథ’

Nirmal Koyya Bommalu: నిర్మల్‌ బొమ్మలు.. ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మల్లో ఇట్టే ఆకర్షించే గుణమేదో ఉంది. చూపరుల హృదయాల్లో కళాతృష్ణను తట్టి లేపి, రసస్వాదనలో సమ్మోహితుల్ని చేసే అంతర్లీనమైన రంగుల పరిమళమేదో ఉంది. అందుకే, ఇవి అజరామరమై భాసిల్లుతూ విశ్వఖ్యాతి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆది నుంచి నిర్మల్‌ ప్రసిద్ధి చెందిన కళాకేంద్రం. శిల్పకళాకారులు, చిత్రకళాకారులు, నటులు ఇంకా అనేక కళల్లో ఆరితేరిన సృజనులకు ఇది నెలవు. 400 సంవత్సరాలుగా నిర్మల్‌ చిత్రకళకు, బొమ్మలకు నిలయంగా […]

Written By: Raj Shekar, Updated On : April 21, 2023 3:10 pm
Follow us on

Nirmal Koyya Bommalu

Nirmal Koyya Bommalu: నిర్మల్‌ బొమ్మలు.. ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మల్లో ఇట్టే ఆకర్షించే గుణమేదో ఉంది. చూపరుల హృదయాల్లో కళాతృష్ణను తట్టి లేపి, రసస్వాదనలో సమ్మోహితుల్ని చేసే అంతర్లీనమైన రంగుల పరిమళమేదో ఉంది. అందుకే, ఇవి అజరామరమై భాసిల్లుతూ విశ్వఖ్యాతి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆది నుంచి నిర్మల్‌ ప్రసిద్ధి చెందిన కళాకేంద్రం. శిల్పకళాకారులు, చిత్రకళాకారులు, నటులు ఇంకా అనేక కళల్లో ఆరితేరిన సృజనులకు ఇది నెలవు. 400 సంవత్సరాలుగా నిర్మల్‌ చిత్రకళకు, బొమ్మలకు నిలయంగా మారింది. నిర్మల్‌ కళాకారులు కర్రతో బొమ్మలు తయారు చేస్తూ చెక్కకు రెక్కలు తొడిగి జీవం పోస్తున్నారు. వీరు తాము తయారు చేసుకున్న కాన్వాసులపై కమనీయ చిత్రాలు గీస్తూ అంతర్జాతీయ కీర్తిని గడిస్తున్నారు.

సహజత్వం ఉట్టిపడేలా..
వివిధ వర్ణశోభితమైన నిర్మల్‌ కొయ్య బొమ్మలను చూడగానే హృదయం తెలియని ఆహ్లాదం పొందుతుంది. ప్రఖ్యాతి గాంచిన అజంతా వర్ణ చిత్రాలు సజీవ ఆకృతుల్లా గోడలకు కొలువు తీరి ఉంటే చూసిన కళ్లలో వింత వెలుగు జిలుగులు కనిపిస్తాయి. చెట్ల రసాల్ని, పువ్వులనుంచి తీసిన రంగులను వాడుకొని అత్యద్భుత చిత్రాలను నాటి కళాకారులు వేశారు. అజంతా వర్ణ చిత్రాల్ని కొత్త అందాల్లో సజీవ రీతుల్లో చిత్రించగల నేర్పు నిర్మల్‌ కళాకారులది.

Nirmal Koyya Bommalu

 

చరిత్ర ఇదీ..
మెత్తని చెక్క బొమ్మలు, పెయింటింగ్‌లను తయారు చేసే 400 ఏళ్ల సంప్రదాయాన్ని కలిగి ఉన్న నిర్మల్‌ ఆర్ట్, హస్తకళల ప్రపంచంలో గర్వించదగిన స్థానాన్ని ఆక్రమించింది. చక్కగా చెక్కబడిన బొమ్మలు మరియు అందమైన పెయింటింగ్‌లు ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది ఇళ్లలో డ్రాయింగ్‌ రూమ్‌లను అలంకరించడానికి ఉపయోగించబడుతున్నాయి. నిర్మల్‌ ఒకప్పుడు ఫిరంగులు మరియు బొమ్మల వంటి విభిన్న వస్తువుల ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఫౌండరీ హైదరాబాద్‌ నిజాం సైన్యానికి భారీ ఫిరంగిని సరఫరా చేయగా, నక్కాష్‌ కళాకారులు మరియు కళాకారులు నిర్మల్‌ ఆర్ట్‌ పేరుతో సున్నితమైన చెక్క బొమ్మలు మరియు డ్యూకో పెయింటింగ్‌లను తీసుకువచ్చారు. హైదరాబాద్‌లోకి ప్రవేశించిన వెంటనే ఫౌండ్రీ మూసివేయబడింది, అయితే కళారూపం అనేక హెచ్చు తగ్గులు నుండి బయటపడింది, దాని పోషకుడైన నిజాంను కోల్పోవడం చాలా ప్రభావం చూపింది.

తయారీలో ప్రత్యేకత..
నిర్మల్‌ కొతయ్యబొమ్మలు తయారు చేసేవారి మూలాలకు సంబంధించిన రికార్డులు ఇప్పుడు లేనప్పటికీ, నక్కాష్‌ కుటుంబాలు 17వ శతాబ్దంలో రాజస్థాన్‌ నుంచి నీమా నాయక్‌ లేదా నిమ్మ నాయుడు ద్వారా ఇక్కడికి తీసుకువచ్చారని నమ్ముతారు. అప్పటి నుండి వారి కళారూపంలో అనేక మార్పులు స్పష్టంగా అప్పటి పోషకుల అభిరుచికి అనుగుణంగా చేర్చబడ్డాయి. ప్రారంభంలో, నక్కాష్‌ లేదా జింగార్‌ కళాకారులు స్థానికంగా లభించే వివిధ రకాలైన పోనికి లేదా వైట్‌ సాండర్‌ నుంచి బొమ్మలను మాత్రమే ఉత్పత్తి చేసేవారు. వీరు గత నిజాం పాలనలో చెక్కతో చేసిన ఫర్నిచర్‌ను తయారు చేశారు. ఇప్పుడు, అవి స్థానిక సాఫ్ట్‌వుడ్‌ నుంచి∙చెక్కబడ్డాయి మరియు డ్యూకో పెయింట్‌లతో పెయింట్‌ చేయబడ్డాయి. ఆచారాలలో వచ్చిన మార్పు కారణంగా జింగార్లు చక్కటి కిష్టి (ట్రే), ఖంచిబ్బా చౌకీ(సెట్టీ) లేదా పలాంగ్‌ (మంచం) తయారీని నిలిపివేశారు.

కర్రతో కమనీయం..
సహ్యాద్రి పర్వతక్షిశేణులు, అమాయకమైన ఆదివాసులు, బాసర సరస్వతీ ఆలయం, నిర్మల్‌ పెయింటింగ్‌లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ప్రత్యేక అందాలు. జిల్లాకు ప్రధాన ద్వారంగా, ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉన్న నిర్మల్‌ మొదటి నుండి రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక, కళారంగాలలో ప్రధాన కూడలిగా నిలిచింది. నిర్మల్‌ డివిజన్‌ పరిధిలోని జన్నారం, ఖానాపూర్‌ అడవుల్లో లభించే ‘పొనికి’ కర్ర కొయ్యబొమ్మలకు జీవగర్ర. ఈ కర్ర తేలికగా ఉంటుంది. దీన్ని అటవీశాఖ నుంచి కొనుగోలు చేస్తారు. పొనికి కర్రను కావాల్సిన తీరులో మలిచి చింతగింజల గుజ్జును పూస్తారు. ఎండలో నిర్ణీత సమయం వరకు ఆరబెట్టిన తర్వాత కోరుకున్న ఆకృతిలోకి మలచడానికి అనుపుగా చేస్తారు. సహజ సిద్ధమైన రంగులు పూస్తారు. రంగులు వేసే సందర్భంలో కళాకారులు అత్యంత జాగ్రత్త వహిస్తారు. అనంతరం షో కేసుల్లో కొలువుదీరిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సహజత్వం కోసం వీరు అహోరాత్రులు శ్రమిస్తే గానీ మనం చూస్తున్న రూపురాదు.

Nirmal Koyya Bommalu

సహజ రంగుల నుంచి డ్యూకో పెయింట్స్‌..
గతంలో కొయ్య బొమ్మలకు సహజ రంగులనే వాడేవారు. అయితే ఆకర్షణ తక్కువగా ఉండడంతో కళాకారులు కూడా సహజ రంగుల నుండి డ్యూకో పెయింట్‌లకు మారారు. డ్యూకో రంగుల వాడకం వల్ల నిర్మల్‌ పెయింటింగ్‌లు విలక్షణమైన మెరుపును సంతరించుకున్నాయి. బొమ్మలు ఎనామెల్‌ రంగులలో కూడా పెయింట్‌ చేయబడతాయి, అవి వాటికి ప్రసిద్ధి చెందాయి.

నిర్మల్‌ పెయింటింగ్స్‌పై కథలు..
నిర్మల్‌ పేయింటింగ్స్‌పై ఆసక్తికరమైన కథలెన్నో ఉన్నాయి. నాటి రాజులను మెప్పించడమే కాదు, స్వాతంత్య్రం అనంతరం ఎందరో నేతల్ని ముగ్దుల్ని చేసిన ఘనత నిర్మల్‌ కళాకారులది. 1975లో పోచంపాడ్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వచ్చినప్పుడు అల్పాహారంగా ఆయన పండ్లు కావాలన్నారట. అక్కడే ఉన్న సెక్రటరీ ట్రేలో కొన్ని ద్రాక్ష పండ్లు పెట్టి తెచ్చాడు. అందులో ఒక గుత్తి నిర్మల్‌ కళాకారులు తయారుచేసినవి. నెహ్రూ దాన్ని తెంపి తిందామనుకుంటే ఎంతకి పండ్లు ఊడి రాలేదు. నెహ్రూ నవ్వి ఎంతో మెచ్చుకున్నాడట. కొందరు సీనియర్‌ కళాకారులు చెప్పిన యదార్థగాథ ఇది. ఆరు దశాబ్దాల కిందటి ఈ ముచ్చటను ఇప్పుడున్న పెద్ద మనుషులు గర్వంగా చెప్పుతారు.

– గోదావరిపై సొన్నపూలు(సోన్‌ బ్రిడ్జి) కడ్తున్నారన్న వార్త పల్లెపప్లూకు పాకింది. విశాలమైన గోదావరి నదిపై వంతెన నిర్మిస్తున్నారన్నది వింతలో వింతగా తోచింది. అంతేగాక సాక్షాత్తు యువరాజు మీర్‌ ఉస్మాన్‌ ఆలిఖాన్‌ ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు ప్రజలందరికీ దండోరా ద్వారా తెలిసిపోయింది. వేలాదిగా ప్రజలు బండ్లు కట్టుకొని సొన్న (సోన్‌) చేరుకున్నారు. కాలినడకన మరెందరో చేరుకున్నారు. ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే అక్కడ ఉన్న అతిథి గృహానికి చేరుకున్నాడు నిజాం రాజు. వెళ్లి కుర్చీపై మీద కూర్చోగానే పైనుంచి∙మల్లెపూలు నెత్తిన అక్షతలుగా కురిసాయి. సన్నని కట్టె బెరడుతో తయారు చేసిన మల్లెపూలను చూసి నిజాం రాజు ఆశ్చర్యపోయారట. అక్కడే ఉన్న తహసీల్‌దారు నిర్మల్‌ కళాకారుల అద్భుత పనితనం గురించి సవివరంగా తెలియజేశారట. దాంతో నిజాం రాజు ఆనాటి నిర్మల్‌ కళాకారులను అభినందించి తగు నజరానాలిస్తానని హామీ ఇచ్చాడట.

ఇలా వెళ్లాలి..
హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొత్త నాలుగు లేన్ల జాతీయ రహదారి నంబర్‌ 44 నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న ఈ పట్టణంలో నక్కాష్‌ కళాకారులచే సొగసైన బొమ్మలు మరియు పెయింటింగ్‌లు ఉత్పత్తి చేయబడుతున్నాయి.

Tags