Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో తలదూర్చి అప్రదిష్ట మూటగట్టుకున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహానుభావులు ఊరకే అనరు. నోరు జారరని తెలిసినా ఉన్నట్లుండి జగన్ పై వ్యతిరేక ధోరణిలో మాట్లాడటంతో లాభాలు చూసుకునే చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో విమర్శలు వచ్చినా అవి తమకు అనుకూలమే అని చెబుతున్నారు. అందుకే జగన్ పై కావాలనే విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.

2019 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ లో సెటిలైన ఆంధ్రా వాళ్లకు ప్రస్తుతం జగన్ మీద ఆగ్రహం పెరుగుతోంది. ఆయన విధానాలు నచ్చక సాఫ్ట్ వేర్, మేధావివర్గం, సోషల్ మీడియా ప్రభావిత ప్రజలు పెద్ద సంఖ్యలో జగన్ పై కోపంతో ఉన్నారు.దీంతో రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లు టీఆర్ఎస్ కు పడాలంటే జగన్ తో సంబంధాల కంటే గొడవలే మేలని భావించారు. ఇందులో భాగంగానే జగన్ పై విమర్శలతో వివాదం రేపినట్లు చెబుతున్నారు.
Also Read: KA Paul: కేఏ పాల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారు? ఆయనకు పుషింగ్ ఇచ్చే వారెవరు?
ఆంధ్రా ఓటర్లు హైదరాబాద్ లో లక్షల్లో ఉన్నారు. వారంతా ఇక్కడే సెటిల్ అయ్యారు. దీంతో వారి ఓట్లు కూడా కీలకమే కానున్నందున వారికి జగన్ పై ఉన్న ద్వేషాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కేటీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను జగన్ ను విమర్శిస్తే వారి ఓట్లు తమకు పడతాయనే భావం కేటీఆర్ లో వచ్చినట్లు భోగట్టా.. అందుకే జగన్ పై విమర్శలు చేసి ఆ ఫలితం పొందాలని ఆలోచించినట్లు సమాచారం.

తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఓటర్లను తమ వైపు తిప్పుకునే చర్యల్లో భాగంగానే కేటీఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు.దానికి ఇంకా చాలా టైమున్నా ఇప్పటినుంచే ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్లు సామాజిక వర్గాల వారీగా చీలిపోరు. వారు ఏ పార్టీకి వేయాలనుకున్నా ఒకే తాటిమీదకు వచ్చి వేస్తుంటారు. అందుకే 2018లో వారి ఓట్లన్ని టీఆర్ఎస్ కే పడినట్లు సర్వేలు తెలిపాయి. దీంతో ఇప్పుడు కూడా వారిని తమ వెంటే ఉంచుకోవాలని కేటీఆర్ పాచికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్లు కేటీఆర్ రాజకీయ వ్యూహాలు ఇప్పటినుంచే అమలు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి గాను ఆంధ్ర ఓటర్లతోనే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. కానీ తొందరపాటు వల్ల గ్రహపాటు కు గురైతే కష్టమే. ఆచితూచి వ్యవహరించే కేటీఆర్ ఈ విషయంలో ఎందుకంత ముందుచూపుతో వ్యవహరించారనే దానిపై స్పష్టత లేదని తెలుస్తోంది.
Also Read:Telangana BJP: అతడే బీజేపీ సీఎం క్యాండిడేట్.. తెలంగాణ బీజేపీలో మళ్లీ హీట్