Rajasthan High Court : వివాహేతర సంబంధం నేరం కాదట? హైకోర్టు తీర్పు చర్చనీయాంశం

పెడ ధోరణులు నిత్య కృత్యమయ్యాయి. ఇలాంటప్పుడు వాటికి అడుకట్ట వేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంటుంది. అలాకాకుండా కొన్ని కేసులను పరిగణలోకి తీసుకొని ఇలాంటి తీర్పులు ఇస్తే వాటి ప్రభావం సమాజం మీద తీవ్రంగా ఉంటుందని" సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 2, 2024 10:21 pm

Rajasthan High Court

Follow us on

Rajasthan High Court : ప్రేమంటే.. రెండు మనసులు కలయిక.. పెళ్లంటే ఇద్దరు మనుషులు కలయిక.. శృంగారం అంటే రెండు దేహాల కలయిక.. అయితే ఈ ప్రేమ, పెళ్లి, శృంగారం గురించి ఇప్పటివరకు సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రాల హైకోర్టుల వరకు పలు తీర్పులు వెలువరించాయి. కొన్ని తీర్పులు వివాదాస్పదం కాగా.. మరికొన్ని తీర్పులు చర్చకు దారి తీశాయి. అలాంటి తీర్పును రాజస్థాన్ హైకోర్టు మంగళవారం వెలువరించింది. సున్నితమైన కేసులో చర్చకు దారి తీసే తీర్పు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇంతకీ ఏమిటి ఆ కేసు? ఎక్కడ జరిగింది ఆ ఘటన? హైకోర్టు అలా ఎందుకు తీర్పు ఇచ్చిందో? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో ఓ వివాహిత అపహరణకు గురైంది. దీనికి సంబంధించి ఆమె భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. “నా భార్యను ముగ్గురు వ్యక్తులు అపహరించారని” పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఈ కేసును కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసు కు సంబంధించి మంగళవారం జస్టిస్ బీరేంద్ర కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది..

“ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం వ్య**** నేరం కిందకు రాదు. పరిణతి చెందిన వయసుకు వచ్చిన తర్వాత ఇద్దరు మనుషులు వివాహం అనంతరం సంబంధం కలిగి ఉంటే.. దానిని చట్టబద్ధమైన నేరంగా ధర్మాసనం పరిగణించదు. ఇద్దరూ కూడా వారి ఇష్టానుసారం శారీరక సంబంధాలు కలిగి ఉంటే అది నేరం కాదు. ఈ కేసులో ఎలాంటి తప్పులేదంటూ” కేసును కోర్టు కొట్టి వేసింది.

ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో తన భార్యను ముగ్గురు వ్యక్తులు అపహరించారంటూ ఓ వ్యక్తి ఆరోపించాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసు కోర్టుకు బదిలీ కావడంతో.. ఫిర్యాదు చేసిన వ్యక్తి భార్య కోర్టుమందు హాజరైంది. తన ఇష్టానుసారంగానే నిందితుడితో సహజీవనంలో ఉన్నట్టు ప్రకటించింది. తనను ఎవరూ అపహరించలేదని ఆమె కోర్టు ఎదుట స్పష్టం చేసింది. దీంతో బీ రేంద్ర కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం కేసు పూర్వాపరాలు పరిశీలించి పై విధంగా తీర్పు ఇచ్చింది..”ఆమె మోసగించినందు వల్ల చర్యలు తీసుకోవాలని” ఆ భర్త తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

రాజస్థాన్ కోర్టు తీర్పు నేపథ్యంలో వివాహేతర సంబంధాలు పెరుగుతాయని పలువురు సామాజికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు..”మనదేశంలో న్యాయస్థానం చెప్పిందే అంతిమం. అలాంటప్పుడు కొన్ని కేసులను పరిగణలోకి తీసుకొని సంచలన తీర్పు ఇస్తే సమాజం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇప్పటికే మన సంస్కృతిలో పాశ్చాత్య పోకడలు వచ్చేశాయి. పెడ ధోరణులు నిత్య కృత్యమయ్యాయి. ఇలాంటప్పుడు వాటికి అడుకట్ట వేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంటుంది. అలాకాకుండా కొన్ని కేసులను పరిగణలోకి తీసుకొని ఇలాంటి తీర్పులు ఇస్తే వాటి ప్రభావం సమాజం మీద తీవ్రంగా ఉంటుందని” సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.