హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. మునిగిన కాలనీలు

వానొస్తే ఇన్నాళ్లు పండుగలా ఉండేది. ‘ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ అని ఆడపడుచులు సినిమా పాటలు పాడేవారు. కానీ ఏదైనా అతి అయితే అనర్థమే. అదీ హైదరాబాదీలకు ఇంకా చాలా డేంజర్. గత ఏడాది హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలు మరిచిపోకముందే మరోసారి హైదరాబాద్ ను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్ ను రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు కుండపోత కురిసింది. అత్యధికంగా నాగోల్ […]

Written By: NARESH, Updated On : July 15, 2021 1:07 pm
Follow us on

వానొస్తే ఇన్నాళ్లు పండుగలా ఉండేది. ‘ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ అని ఆడపడుచులు సినిమా పాటలు పాడేవారు. కానీ ఏదైనా అతి అయితే అనర్థమే. అదీ హైదరాబాదీలకు ఇంకా చాలా డేంజర్. గత ఏడాది హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలు మరిచిపోకముందే మరోసారి హైదరాబాద్ ను వానలు అతలాకుతలం చేస్తున్నాయి.

హైదరాబాద్ ను రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు కుండపోత కురిసింది. అత్యధికంగా నాగోల్ బండ్లగూడలో 21.2 సెం.మీలు, ప్రశాంత్ నగర్ లో 19.2 సెం.మీలు, హస్తినాపురంలో 19 సెం.మీలు, సరూర్ నగర్ లో 17.9 సెం.మీలు, హయత్ నగర్ లో 17.1 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇంత కుండపోత వానతో హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కమలానగర్ తదితర ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి.

సరూర్ నగర్ చెరువులోకి భారీగా వరద చేరడంతో చైతన్యపురి పరిధిలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలో ముంపనకు గురైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డిజిస్టర్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

ఇప్పటికే గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ వేళ భారీ వర్షాలకు హైదరాబాద్ లో వరదలు వచ్చాయి. పలువురు వరదల్లో కొట్టుకుపోయారు. కాలనీలు మొత్తం నీట మునిగాయి. ఆక్రమణలు, కబ్జాల వల్లే ఇలా జరిగిందని హైదరాబాదీలు ఆందోళన కూడా చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటిదే పునరావృతం కావడంతో హైదరాబాద్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.