PM Modi Tweet: తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ముఖ్య నేతలు నగరానికి చేరుకున్నారు. నగరంలో కాలు పెట్టగానే డైనమిక్ సిటీలో కాలు పెట్టానని ప్రధాని ట్వీట్ చేయడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై బీజేపీ నేతలు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారు రెండు రోజుల పాటు నగరంలో ఉండి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై నేతలకు సూచించనున్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసమే కార్యకర్తలతో ప్రధాని నిర్వహించే బహిరంగసభలో ప్రధాని కీలక నిర్ణయం వెలిబుచ్చనున్నట్లు ప్రచారం సాగుతోంది. నగరంలో ప్రజలకు కిక్కు ఇచ్చే నిమిత్తం ప్రధాని ఓ ప్రకటన చేస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతోనే ఇక్కడ పార్టీని నిలబెట్టాలనే ఉద్దేశంలో నాయకత్వం కీలక కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ ఇద్దరు కలిసి ఓ బృహత్తర ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. దీని కోసమే వారు హైదరాబాద్ నగరంలో జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు కూడా చెబుతున్నారు. మొత్తానికి రేపటి సమావేశంలో ప్రధాని మోడీ కార్యకర్తల సమక్షంలో మహత్తరమైన నిర్ణయాన్ని వెలిబుచ్చనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలు కార్యకర్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం వారికి మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీని తెలంగాణలో విస్తరించేలా కూడా ఓ కార్యక్రమం రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. ఈ సమావేశాల్లో ఓ కీలక తీర్మానం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అదే అన్ని రోగాలకు మందులా పని చేస్తుందని నేతలు ఆశిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ చెబుతున్న మాటలకు అందరు ఫిదా అవుతారని ఆశిస్తున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో బీజేపీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు సూచనలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని నలుదిశలా వ్యాపించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొత్తానికి కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ ఏ మేరకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారో వేచి చూడాల్సిందే మరి. ప్రధాని తెలంగాణలో అడుగు పెట్టగానే రాష్ట్రం గురించి ప్రత్యేకంగా కితాబు ఇచ్చారు. నగరం గురించి పలు విషయాలు వెల్లడించారు. ప్రధాని మోడీ రాగానే తెలంగాణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.