NagaBabu Speech at Janasena Womens Training : జనసేన వీరమహిళలు తరలిరావడాన్ని చూసి జనసేన నేత నాగబాబు ఆశ్చర్యపడ్డారు. జనసేన సమావేశానికి ఇంత మంది వస్తారని అనుకోలేదని.. పార్టీ కోసం ఇంతగా తపనపడుతున్న వీర మహిళలను చూస్తే గర్వంగా ఉందని ఎమోషనల్ అయ్యారు.

వీరమహిళలు కేవలం గుంటూరు, కృష్ణ నుంచే వస్తారనుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీపై అభిమానంతో తరలిరావడం పార్టీపై వారి ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు రాజకీయాల్లోకి రావాలని జనసేన నేత నాగబాబు పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో గుంటూరు-కృష్ణా జిల్లాల వీర మహిళల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. పురుషులతో సమానంగా మహిళలు రాజకీయాల్లో రాణించాలని సూచించారు.
నాగబాబు మాట్లాడిన ఈ మాటలు జనసేన వీర మహిళల్లో స్ఫూర్తిని నింపాయి. పార్టీ కోసం తామంతా కలిసి పనిచేస్తామని వారంతా తీర్మానించారు.

[…] […]