https://oktelugu.com/

Corona: ఇలాంటివారు వ్యాక్సిన్ అవసరం లేకున్నా కరోనాను ఎదుర్కొంటారా..?

Corona: రెండేళ్లుగా కరోనా చేసిన విజృంభనతో ఇప్పటికీ కొన్ని దేశాలు కోలుకోవడం లేదు. కంటికి కనిపించకుండా ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరి బాడీల్లోకి దాదాపు కరోనా ప్రశేశించిందని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. అయితే వైద్యులు కరోనా నుంచి తప్పించేందుకు శత విధాలుగా ప్రయత్నించారు. కానీ కోట్ల మంది ప్రాణాలు నిలవలేకపోయాయి. మరికొందరు మాత్రం ఈ మహమ్మారి నుంచి తప్పించుకున్నారు. 30 ఏళ్ల వయసు కూడా నిండని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2021 / 10:26 AM IST
    Follow us on

    Corona: రెండేళ్లుగా కరోనా చేసిన విజృంభనతో ఇప్పటికీ కొన్ని దేశాలు కోలుకోవడం లేదు. కంటికి కనిపించకుండా ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరి బాడీల్లోకి దాదాపు కరోనా ప్రశేశించిందని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. అయితే వైద్యులు కరోనా నుంచి తప్పించేందుకు శత విధాలుగా ప్రయత్నించారు. కానీ కోట్ల మంది ప్రాణాలు నిలవలేకపోయాయి. మరికొందరు మాత్రం ఈ మహమ్మారి నుంచి తప్పించుకున్నారు. 30 ఏళ్ల వయసు కూడా నిండని వారు కరోనాకు బలయ్యారు. 90 ఏళ్ల పైబడిన వారు కరోనా సోకినా ఆ వైరస్ నుంచి కోలుకోగలిగారు. అయితే ఇందుకు కారణం వారిలో ఉండే రోగనిరోధక శక్తి అని వైద్యులు నిర్దారించారు.

    Also Read: కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్.. ఆ వ్యాధి వస్తుందట?

    Coronavirus

    ప్రస్తుతం కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు మినహా కరోనా కేసులు పెద్దగా నమోదు కావడం లేదు. దీనికి అత్యధిక వేగంగా జరిపిన వ్యాక్సినేషనే కారణమని అంటున్నారు. అయితే బ్రిటన్ లాంటి దేశాల్లో రెండు డోసులు వేసుకున్నా కరోనా సోకుతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి గల కారణాలను వైద్యులు పరిశోధనలు నిర్వహించారు. కరోనా కేసులు పెద్దగా నమోదు కాకపోవడంతో ఆయా దేశాలు సాధారణ పరిస్థితులకు వచ్చినట్లే తెలుస్తోంది. మాస్కులు ధరించడం తప్ప మిగతా పనులన్నీ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కేసులు నమోదు కావడం లేదు. ఇందుకు ప్రతీ మనిషిలో ఉండే యాండీ బాడీస్ డెవలప్ కావడమేనని అంటున్నారు.

    కొందరు వైద్యులు కరోనా పీక్ స్టేజీలో ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి వైద్య చికిత్స చేశారు. కానీ వారికి ఎలాంటి హానీ కలగలేదు. అలాంటి వారి రక్తనమూనాలను సేకరించి పరిశోధించారు. పదిమందిలో ఒకరికి కూడా కోవిడ్ సోకలేదు. కనీసం లక్షణాలు కూడా కనిపించలేదు. పదే పదే పరీక్షలు నిర్వహించినా పాజిటివ్ రిపోర్టు రాలేదు. పోనీ వారిలోఈ మధ్య వారిలో యాండీ బాడీస్ అభివృద్ధి చెందాయా..? అంటే అదీ లేదు. దీంతో వారిలో సహజంగా వ్యాధి నిరోధక శక్తి ఉందని గుర్తించారు. ఎలాంటి వైరస్ అయినా దాడి చేయకముందే ఇటువంటి వారిలో వ్యాధి నిరోధక శక్తి ముందే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనినే ‘అబార్టివ్ ఇంఫెక్షన్’ అని అంటారు. ఇలాంటి వారి బాడీలో రక్షక కణాలు ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కొనగలవు.

    కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రస్తుతం చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగిస్తోంది. ఈక్రమంలో నిర్బంధ వ్యాక్సిన్ కూడా సాగుతోంది. అయితే కరోనా తగ్గడానికి కారణం వ్యాక్సినేషన్ మాత్రమేనని అంటున్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కొనే రక్షక కణాలను వ్యాక్సిన్లలో ఉపయోగించగలిగితే ఉన్న వాటికంటే మెరుగైన టీకా తయారు చేయవచ్చని అంటున్నారు. కొందరిలో ఎలాంటి కొత్త వ్యాధి వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంది. అలాంటి వారి కణాలను ఇప్పుడు వేస్తున్న వ్యాక్సిన్ కు జోడిస్తే భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారి నుంచి కాపాడుకోవచ్చు.

    ‘రక్షక కణాల’ ద్వారా కొవిడ్ సోకిన వారి కణాలను గుర్తించి వాటిని నిర్మూలించవచ్చు. ఇప్పుడున్న వ్యాక్సిన్ల కంటే రక్షక కణాలు ఎక్కువే పనిచేస్తాయి. సాధారణకంగా కరోనా వైరస్ పై వ్యాక్సిన్లు స్పైక్ ప్రొటీన్లపై దాడి చేస్తాయి. కానీ రక్షక కణాలు మాత్రం వైరస్ లోపలి ప్రోటీన్లు గుర్తించగలుగుతాయి. కరోనా లోపల ఉండే ప్రొటీన్లు పెరగడమే వైరస్ విజృంభణకు కారణం. ఈ క్రమంలో వైరస్ లోపలి ప్రోటీన్ల లక్ష్యంగా టీకాలు తయారు చేయగలిగితే వైరస్ ను పూర్తిగా నిర్మూలించవ్చని వైద్య పరిశోధకులు అంటున్నారు.

    Also Read: ప్రియుడు మాట్లాడడం లేదని డయల్ 100కు ఫోన్ చేసిన లవర్